అమిత్‌షా తెలంగాణ టూరు ర‌ద్దుకు కార‌ణం ఏంటి?

అమిత్‌షా తెలంగాణ టూరు ర‌ద్దుకు కార‌ణం ఏంటి?

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా టూర్‌పై తెలంగాణ బీజేపీ నేత‌ల్లో హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాలని, రాబోయే కాలంలో పీఠం కైవ‌సం చేసుకోవాల‌ని బీజేపీ స్కెచ్చులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ పార్టీ తెలంగాణ‌, ఏపీపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. ఈ విష‌యాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు నేత‌లు చెప్తున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రాంతాల్లో కూడా 2019 ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ గట్టిగా ఫిక్స్ అయ్యింది. తెలంగాణ బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రాష్ట్రంలో పర్యటించనున్నారని, వచ్చే వారం జూన్ 22న అమిత్ షా తెలంగాణ పర్యటన ఫిక్స్ అయ్యిందని బీజేపీ పేర్కొంది. అయితే అది చివ‌రి నిమిషంలో వాయిదా ప‌డ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టీఆర్‌ఎస్ పార్టీకి గ‌ట్టి ప్ర‌త్య‌ర్థిగా ఎద‌గాలని, తెలంగాణలో మెజారిటీ స్థానాలు పొందాలనే ఆలోచనలతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా తెలంగాణ బీజేపీ సాధించిన సీట్లు, ఓట్లు నామమాత్రమే. గత ఎన్నికల్లోనూ కేవలం 5 స్థానాలకే భారతీయ జనతా పార్టీ పరిమితమైంది. అవి కూడా హైదరబాద్ నగరంలో గెలుపొందినవే. భాగ్యనగరంలో మినహా ఇస్తే రాష్ట్రంలో మరెక్కడా బీజేపీ పార్టీకి చెప్పుకోదగినంత ఓట్లు కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలో అమిత్ షా తెలంగాణలో పర్యటించి, రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు, అనుచరులకు, కార్యకర్తలకూ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారని బీజేపీ రాష్ట్ర పెద్ద‌లు తెలిపారు. అయితే అనూహ్య రీతిలో ఆ టూర్‌కు బ్రేక్ ప‌డింది.

బీజేపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అమిత్ షా టూర్ ర‌ద్దైంది. జూలైలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే హ‌ఠాత్తుల‌గా ఎందుకు టూర్ ర‌ద్దు అయింద‌నేది అందరికీ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం. పార్టీ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారి ప్ర‌కారం...పార్టీలో పెద్ద‌గా చేరిక‌లు ఏమీ లేదు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మైన నేత‌లు గుడ్‌బై చెప్తున్న క్ర‌మంలో త‌న‌ ప‌ర్య‌ట‌న స‌రైన సంకేతాల‌ను పంప‌ద‌ని భావించి అమిత్ షా హైద‌రాబాద్ రాక‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు స‌మాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు