బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ప్ర‌ధాని...ఇదో రికార్డు

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ప్ర‌ధాని...ఇదో రికార్డు

ఔను. సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఇలా జ‌న్మ‌నివ్వ‌డ‌మే ఆ ప్ర‌ధాన‌మంత్రిని రికార్డుకు చేరువ చేసింది. ఇంత‌కీ ఆ మ‌హిళ ఎవ‌రంటే...న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ (37). ఆమె ఇవాళ ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

న్యూజిలాండ్ చరిత్రలో ప్రధానమంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.  పాప 3.31 కిలోల బరువు ఉంది. ఆరోగ్యవంతమైన పాపకు జన్మనివ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆక్లాండ్ సిటీ హాస్పిటల్ డాక్టర్లకు కృతజ్ఞతలు అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.

ప్రధానిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి వ్యక్తిగా పాకిస్థాన్‌కు చెందిన బెనజీర్ భుట్టో నిలిచారు. ఆమె 1990లో ఇలా ప్రధాని పదవిలో ఉండగానే తల్లయ్యారు. నిజానికి న్యూజిలాండ్ ప్రధాని పదవి చేపట్టడానికి కేవలం ఆరు రోజుల ముందే గతేడాది అక్టోబర్ 13న తాను గర్భవతిని అని జెసిండా గుర్తించారు. ఈ విషయాన్ని ఈ ఏడాది మొదట్లో వెల్లడించారు. తాను బిడ్డను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె మెటర్నిటీ లీవ్‌లో ఉండటంతో మరో ఆరు వారాల పాటు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విన్‌స్టన్ పీటర్స్ తాత్కాలిక ప్రధాని బాధ్యతలు చేపడుతున్నారు.

ఆగస్ట్ తొలి వారంలో తాను మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నట్లు జెసిండా చెప్పారు. గతేడాదే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని పదవిని చేపట్టిన జెసిండా అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రికార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు