ఫేక్ న్యూస్ ల‌పై గూగుల్ వార్!

ఫేక్ న్యూస్ ల‌పై గూగుల్ వార్!

నేటి స‌మాజంలో జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటోన్న ప్ర‌ధాన స‌మ‌స్య ఫేక్ న్యూస్. మీడియాలో, సోష‌ల్ మీడియాలో ఫేక్ న్యూస్ ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, చాలా సంద‌ర్భాల్లో జ‌ర్న‌లిస్టులు ఫేక్ న్యూస్ ల‌నే...నిజ‌మ‌ని న‌మ్మి ఇబ్బందుల పాల‌వుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో ఏది ఫేక్ న్యూసో....తెలుసుకునేంత స‌మ‌యం ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా పొర‌పాట్లు జ‌రుగుతుంటాయి. అందుకే, ఈ త‌ర‌హా ఫేక్ న్యూస్ ల‌ను గుర్తించేందుకు గూగుల్ ఇండియా న‌డుం బిగించింది. ఫేక్ న్యూస్ ల‌ను గుర్తించి...నిజ‌నిర్ధార‌ణ చేసుకునేందుకు వీలుగా ఓ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8000 మంది జ‌ర్న‌లిస్టుల‌కు శిక్ష‌ణనిచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు గాను మందుగా 200 మంది జర్న‌లిస్టుల‌ను ఎంచుకొని వారంద‌రికీ ఇంగ్లిషుతో పాటు ఆరు ప్రాంతీయ భాష‌ల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నుంది.

నిజ నిర్ధార‌ణ‌, ఆన్ లైన్ లో ప‌రిశీల‌న‌, జ‌ర్న‌లిస్టుల‌కు డిజిట‌ల్ విజ్ఞానం వంటి అంశాల‌పై శిక్ష‌ణ‌నివ్వ‌బోతున్నామ‌ని గూగుల్ ప్ర‌తినిధి తెలిపారు. ఫ‌స్ట్ డ్రాఫ్ట్, స్టోరీఫుల్, ఆల్ట్ న్యూస్, బూమ్ లైవ్, ఫ్యాక్ట్ చెక‌ర్, డేటా లీడ్స్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌కు చెందిన నిపుణులు రూపొందించిన అంశాల‌ను ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో బోధించ‌నున్నామ‌ని చెప్పారు. త‌ప్పుడు స‌మాచారానికి వ్య‌తిరేకంగా పోరాడుతోన్న జ‌ర్న‌లిస్టుల‌కు మ‌ద్ద‌తివ్వ‌డ‌మే త‌మ ఉద్దేశ్య‌మ‌ని ఆ ప్ర‌తినిధి తెలిపారు. ఇంగ్లిషు, తెలుగు, హిందీ, త‌మిళం, కన్న‌డ‌, బెంగాలీ, మ‌రాఠీ భాష‌ల‌లో శిక్ష‌ణనివ్వ‌బోతున్నామ‌ని చెప్పారు. ముందుగా ఎంపిక చేసిన న‌గ‌రాల నుంచి 200 మందికి 5 రోజుల పాటు శిక్ష‌ణ‌నివ్వ‌నున్నామ‌ని తెలిపారు. ఆ తర్వాత శిక్ష‌ణ పొందిన వారంద‌రూ....మ‌రో 8000 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ఏడాది కాలంలో శిక్ష‌ణ‌నిస్తార‌ని చెప్పారు. రెండు రోజులు, ఒక రోజు పాటు ఆ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఉంట‌యాని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు