మాల్యాకు షాకుల సిరీస్‌లో ఇది రెండోది

మాల్యాకు షాకుల సిరీస్‌లో ఇది రెండోది

లిక్క‌ర్ కింగ్‌, జ‌ల్సారాయుడు విజయ్ మాల్యాకు వ‌రుస బెట్టి షాకులు త‌గులుతున్నాయి. భారతీయ బ్యాంకులకు కనీసం రెండు లక్షల పౌండ్లు చెల్లించాలంటూ ఇటీవ‌లే విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టు ఆదేశించింది. 13 బ్యాంకులకు ఆ సొమ్ము అందాలంటూ కోర్టు పేర్కొన్నది. స్టేబ్ బ్యాంక్ ఇండియా నేతృత్వంలోని 13 బ్యాంకులు వేసిన పిటీషన్‌ను బ్రిటన్ కోర్టు స్వీకరించింది. మే 8వ జరిగిన వాదనల్లో ఆ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జడ్జి ఆండ్రూ హెన్‌షా ఈ తీర్పును వెలువరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను ఫ్రీజ్ చేయాలంటూ కోర్టు ఆ తీర్పులో ఆదేశించింది. ఇలా మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వెలువ‌డిన మ‌రుస‌టి రోజే...విజయ్ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇవాళ ఛార్జ్‌షీట్ నమోదు చేసింది.

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన మాల్యా విదేశాల‌కు చెక్కేసిన సంగ‌తి తెలిసిందే.  ఆ కేసులో అతన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పగింత కేసులో అతను వచ్చే నెలలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా హాజరుకానున్నారు. ఈ ప్ర‌య‌త్నాలు ఓ వైపు జ‌రుగుతుండ‌గానే తాజాగా మనీల్యాండరింగ్ కేసు కింద ఈ అభియోగాలను దాఖలు చేశారు. తాజా ప‌రిణామం మాల్య‌కు షాక్ వంటిదేన‌ని ఆయ‌న ఆస్తుల వేలం ఓవైపు..స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు మ‌రోవైపు ప్ర‌య‌త్నాలు ఈ రూపంలో జ‌రుగుతాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English