బాబు సైలెంట్ అటాక్‌...

బాబు సైలెంట్ అటాక్‌...

చంద్ర‌బాబు ను దెబ్బ కొట్టాల‌ని ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. లేక‌పోతే బాబు వేసే అడుగులు అర్థం చేసుకునే లోపు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. తాను భ‌య‌ప‌డుతున్న‌ట్లు బాబు పైకి మాట్లాడుతూ ఉంటాడు... కానీ  చేయాల్సిన ప‌ని చాలా కూల్ గా చేసుకుపోతారు.

బాబు చ‌రిత్ర‌ను చూసుకుంటే అత‌ను క్లిష్ట‌మైన ప్ర‌తి సంద‌ర్భంలోనూ నిల‌బ‌డ్డాడు. వ్య‌వ‌స్థ‌ల‌పై, చ‌ట్టాల‌పై చంద్ర‌బాబుకు అవ‌గాహ‌న ఎక్కువ‌. అందుకే బాబుతో వైరం అనేక‌ర‌కాలుగా ప్ర‌మాదం అని దాదాపు మోడీకి మొన్నే అర్థ‌మైంది.  అప్ప‌టికి న‌ష్టం జ‌రిగిపోయింది.  కొన్ని సార్లు బాబు ప్రెస్‌మీట్స్‌లో లాగ్ ఉండొచ్చు గాని కంటెంట్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా క్లిష్ట‌మైన విష‌యాన్ని జ‌నాల‌కు చెప్ప‌డంలో బాబు విధాన‌మే వేరు. అది ఒక ప్రాజెక్ట్ కు త‌యారుచేసిన పిపిటి లాగ  ఉంటుంది. తాజాగా చంద్ర‌బాబు డీమానిటైజేష‌న్‌, జీఎస్టీ దేశానికి చేసిన నష్టం గురించి చాలా క్లియ‌ర్‌గా వివ‌రించారు.
 
కేంద్ర ప్ర‌భుత్వ తీరుతో జ‌రిగిన న‌ష్టం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఫ‌లితాల‌ను ఇచ్చిందో చంద్ర‌బాబు వివ‌రించారు. ఒక నిర్ణ‌యాన్ని త‌గిన స‌మ‌య‌మూ, ప‌ద్ధ‌తి లేకుండా అమ‌లు చేస్తే క‌లిగే న‌ష్టాలు ఎంత భ‌యంక‌రంగా ఉంటుందో ఈరోజు స్ప‌ష్టంగా తెలుస్తోందన్నారు.

''భార‌తీయుల‌కు బ్యాంకుల మీద విశ్వాసం పూర్తిగా పోయింది. డీమానిటైజేష‌న‌ల్ ఎంత దారుణమైన ఫ‌లితాల‌ను ఇచ్చిందంటే... ఇక ఎప్ప‌టికీ బ్యాంకుల‌ను న‌మ్మ‌కూడ‌దు అని జ‌నం నిర్ణ‌యించుకునే రోజులను తెచ్చింది. దాని నుంచి కోలుకోక‌ముందే, జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌క ముందే అస్త‌వ్య‌స్తంగా రాసిన ఎఫ్ఆర్డీఐ బిల్లు వ‌ల్ల జ‌నం బ్యాంకుల‌ను, కేంద్రాన్ని అస‌హ్యించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ము త‌మ‌కు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ఉప‌యోగ‌ప‌డ‌క‌పోతే సామాన్యులు క‌డుపు మండ‌దా? అదే జ‌రిగింది దేశంలో'' అని చంద్ర‌బాబు వివ‌రించారు.

డీమానిటైజేష‌న్ సామాన్యులైన చిన్న వ్యాపారుల‌ను, కార్మికుల‌ను న‌ష్ట‌ప‌రిస్తే ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్ర‌తి భార‌తీయుడిని భ‌య‌పెట్టింది. జ‌నానికి న‌మ్మ‌కం పోయింది. ప్ర‌తి రూపాయిని డ్రా చేసేసుకున్నారు. దీంతో పింఛ‌న్లు ఇవ్వ‌డానికి కూడా ప్ర‌భుత్వాల‌కే క్యాష్ దొర‌క‌ని దీన ప‌రిస్థితి ఉంది దేశంలో అని వివ‌రించారు .

ఇదే త‌ప్పు జీఎస్టీలోనూ చేశారు. అసంపూర్ణంగా జీఎస్టీని ప్ర‌వేశ‌పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంది. ట్రేడ‌ర్లు కాదు క‌దా, అస‌లు అధికారులే జీఎస్టీ అమ‌లుకు సిద్ధంగా లేని ప‌రిస్థితుల్లో దేశంలోకి జీఎస్టీని తెచ్చారు. ఇంత పెద్ద నిర్ణ‌యాలు తీసుకునేట‌పుడు ఎంత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి! క‌నీసం జీఎస్టీ పేమెంట్ నెట్‌వ‌ర్క్ కూడా స‌రిగా డెవ‌ల‌ప్ చేయ‌లేదు. అన్నీ బ‌గ్స్‌. దీనివ‌ల్ల ప‌న్ను క‌ట్ట‌డం ఒక ప్ర‌హ‌స‌నంగా మారింది. ఇది నిత్యం బిజీగా ఉండే వ్యాపారుల‌కు తీవ్ర‌మైన న‌ష్టం. రిఫండ్స్‌లో కూడా ఎన్నో ఇబ్బందులు. వ్య‌వ‌స్థ‌ల‌ను ఇంత సింపుల్‌గా తీసుకుంటే ఎలా. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి అని చంద్ర‌బాబు విశ్లేషించారు. ప‌ర్య‌వ‌సానాలు మొత్తం భార‌దేశం అనుభ‌వించాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు.

మొత్తానికి ఇప్ప‌టికే చేసిన త‌ప్పులు ఎలా దిద్దుకోవాలో తెలియ‌ని మోడీ జ‌నాగ్ర‌హాన్ని చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. అయితే చంద్ర‌బాబు మ‌ళ్లీ మ‌ళ్లీ దానిని వివ‌రంగా గుర్తుచేస్తూ జ‌నాల‌కు మోడీ మీద మ‌రింత మండేలా చేస్తున్నారు. త‌న‌కు న‌చ్చ‌ని ప్ర‌తిప‌క్షాల‌ను క‌ప్పెట్ట‌డానికి మోడీ తీసిన కిలోమీట‌రు గోతిలో మోడీయే పడ్డాడ‌న్న‌మాట‌.