మెహ్రీన్ కు అమెరికా అధికారుల షాక్

మెహ్రీన్ కు అమెరికా అధికారుల షాక్

కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పిదానికి ఇంకెవరో బలి కావాల్సి వస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. తన కుటుంబ సభ్యులను కలవడానికి అమెరికాకు వెళ్లిన ఈ భామకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. యుఎస్ విమానాశ్రయంలో ఆమెను అక్కడి అధికారులు అడ్డుకుని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించినట్లు తెలిసింది.

దాదాపు అరగంట పాటు ఆమెను విచారించారట. మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి అనుభవం ఎదురయ్యేసరికి మెహ్రీన్ షాకైందట. ఈ విషయాన్ని మెహ్రీనే స్వయంగా వెల్లడించింది. ఈ అనుభవం తనకు పెద్ద షాక్ అని ఆమె అంది. కుటుంబ సభ్యుల్ని కలవడానికే తాను యుఎస్ వచ్చినట్లు నిర్ధరించుకున్న తర్వాత సారీ చెప్పి తనను విడిచి పెట్టారని ఆమె వెల్లడించింది.

ఇంతకీ మెహ్రీన్ తో యుఎస్ అధికారులు అలా ప్రవర్తించడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే యుఎస్ కేంద్రంగా సెక్స్ రాకెట్ బయటపడటం.. అందులో టాలీవుడ్ కు చెందిన చాలా మంది హీరోయిన్లు భాగస్వాములని వెల్లడి కావడం తెలిసిందే. ఈ ఇష్యూను చాలా తీవ్రంగా తీసుకుని పెద్ద స్థాయిలో విచారిస్తున్నారు అమెరికన్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు వచ్చే తెలుగు హీరోయిన్ల మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.

ఈ క్రమంలోనే మెహ్రీన్ ను పోలీసులు అలా విచారించినట్లు తెలుస్తోంది. పరిస్థితి చూస్తుంటే మున్ముందు యుఎస్ లో జరిగే ఈవెంట్ల కోసం వెళ్లే టాలీవుడ్ హీరోయిన్లకు అంత తేలిక కాదని అర్థమవుతోంది. ఈవెంట్ పేరుతో వెళ్లి అక్కడే నెలలు నెలలు తిష్ట వేసుకుని కూర్చునే వాళ్లను అంత తేలిగ్గా వదిలే పరిస్థితి ఉండకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు