హెచ్‌4 వీసా..ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇదే

హెచ్‌4 వీసా..ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇదే

ఓ వైపు ప్ర‌పంచ శాంతి, అమెరిక‌న్ల సంక్షేమం అంటూ గ‌ళం విప్పుతూ కొర‌క‌రాని కొయ్య‌గా మారిన ఉత్త‌ర‌కొరియా నాయ‌కుడు కిమ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపి అమెరిక‌న్ల‌ను ప్ర‌శాంత‌త‌ను అందించిన అగ్ర‌రాజ్యాధిప‌తి డొనాల్డ్ ట్రంప్ అదే స‌మ‌యంలో ఆ దేశంలో నివసిస్తున్న భార‌తీయుల‌కు నిద్దుర లేకుండా చేస్తున్నారు. త‌మ నైపుణ్యాల‌తో అమెరికా అభివృద్ధికి కృషిచేస్తున్న భార‌తీయుల జీవిత భాగ‌స్వామ్యులు ఉద్యోగం చేయ‌కుండా త‌గిన రీతిలో నిబంధ‌న‌ల అడ్డుక‌ట్ట వేస్తున్నారు. హెచ్‌-1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఇక్కడే ఉద్యోగం చేసుకునేలా అమెరికా తాజా మాజీ ప్రభుత్వం హెచ్‌-4 వీసా నిబంధనను తీసుకురాగా ట్రంప్‌ దీన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువరించ‌నున్నట్లు ట్రంప్‌ పరిపాలన శాఖ అధికారులు వివరించారు.

హెచ్‌-1బీ అనేది ఓ వలస దారు విధానానికి చెందిన వీసా. ప్రతిభావంతులైన చాలా మంది భారతీయులు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. హెచ్‌-1బీ వీసా పొందిన వారి భాగస్వాములకు హెచ్‌-4 వీసా అందజేస్తారు. హెచ్‌1బీ వీసాపై ప‌నిచేస్తున్న వారి జీవిత భాగ‌స్వామ్యులు ఉద్యోగాలు చేసుకునేలా హెచ్‌-4 వీసా పద్ధతిని బరాక్‌ ఒబామా తీసుకొచ్చారు. దీనిపై ఆధారపడి ఐటీ కంపెనీల్లో అనేక మంది భారతీయులు ఉన్నారు. అమెరికా కంపెనీలు దీన్ని సక్రమంగా వినియోగించుకోవడం లేదని, హెచ్‌-4 వీసా పొందిన వారి స్థానంలో అమెరికన్‌ మహిళలకు ఉద్యోగాలు కల్పించేలా ట్రంప్‌ పరిపాలనా శాఖ ఆలోచిస్తున్నది. ఈ విషయమై సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. హెచ్‌-4 వీసాదారులను తొలగించి స్థానికులకు పెద్దపీట వేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఓ అధికారి వివరించారు. వీసా నిబంధనల్లో మార్పులు చేయాలని ట్రంప్‌ పరిపాలనాధి కారులు ఆలోచిస్తున్నారని, అదేవిధంగా ఉద్యోగ కల్పనపై సమీక్షిస్తున్నారని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రతినిధి మైఖేల్‌ బార్స్‌ తెలిపారు. హెచ్‌-4 వీసా తొల గింపు అంశం అనేది ఇంకా తుది దశకు చేరుకోలేదన్నారు. ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. కాగా, హెచ్‌-4 వీసాను రద్దు చేస్తే వేలాది భారతీయ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాదాపు 70 వేల‌మందిపై ఈ ప్ర‌భౄవం ప‌డ‌నుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు