బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీ గుట్టు ర‌ట్టు అయ్యిందిలా!

బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీ గుట్టు ర‌ట్టు అయ్యిందిలా!

బ‌య్యారం ఉక్కు.. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కు అంటూ నిన‌దిస్తూ.. భారీ ఆశ‌ల్ని పెట్టుకున్న వైనం తెలిసిందే. అయితే.. ఈ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ.. బ‌య్యారంలో స్టీల్ ఫ్యాక్ట‌రీ సాధ్యం కాదంటూ కేంద్రం తేల్చి చెప్పిన వైనాన్ని నాలుగేళ్లుగా కేసీఆర్ స‌ర్కారు క‌డుపులో దాచుకున్న దుర్మార్గం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విభ‌జ‌న నేప‌థ్యంలో తెలంగాణ‌లోని బ‌య్యారం.. ఏపీలో క‌డ‌ప‌లో స్టీల్ ఫ్యాక్ట‌రీల మీద హామీ ఇచ్చారు. అయితే.. ఉక్కు ఫ్యాక్ట‌రీ సాధ్యాసాధ్యాలు మాత్ర‌మే ప‌రిశీలించాల‌ని చెప్పారే కానీ.. క‌చ్ఛితంగా నిర్మించి తీరాల‌న్న ప్ర‌స్తావ‌న ఏమీ లేద‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ బ‌య్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ సాధ్యం కాద‌ని కేంద్రం చెప్పిన విష‌యం బ‌య‌ట‌కుఎలా వ‌చ్చింద‌న్న‌ది చూస్తే.. ఆ క్రెడిట్ తెలంగాణ కాంగ్రెస్ నేత క‌మ్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి పుణ్య‌మేన‌ని చెప్పాలి. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు ఆల‌స్య‌మ‌వుతుందంటూ కేంద్రంపై ఒక పిటిష‌న్ ను కోర్టులో దాఖ‌లు చేశారు పొంగులేటి. దీని విచార‌ణ నేప‌థ్యంలో కేంద్ర ఉక్కుశాఖ ఒక అఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది.

బ‌య్యారంలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌టం ఆర్థికంగా అనుకూలం కాద‌న్న వైనాన్ని సుప్రీంకోర్టుకు స్ప‌ష్టం చేసింది. దీనిపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక సైతం బ‌య్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ అసాధ్య‌మ‌ని తేల్చింది. ఈ నేప‌థ్యంలో త‌న వాద‌న‌ను వినిపించిన ఉక్కుశాఖ‌.. అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌కు తెచ్చింది.

అంతేకాదు.. బ‌య్యారంలోనూ..క‌డ‌ప‌లోనూ ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు అసాధ్య‌మ‌న్న వైనాన్ని చెప్పిన‌ట్లుగా తేలింది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ‌చ్చినా.. దాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకురాకుండా గుట్టు చ‌ప్పుడు కాకుండా విష‌యాన్ని త‌మ ద‌గ్గ‌రే ఆపేసింద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా పొంగులేటి సుప్రీంను ఆశ్ర‌యించ‌టం.. కోర్టు ఉక్కుశాఖ‌కు ఆదేశాలు జారీ చేయ‌టంతో అస‌లు వ్య‌వ‌హ‌రం బ‌య‌ట‌కొచ్చిన‌ట్లైంది. తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోస‌మే తాము ప‌ని చేస్తున్న‌ట్లు త‌ర‌చూ చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. మ‌రీ విష‌యాన్ని అంత గుట్టుగా త‌మ క‌డుపులోనే ఎందుకు దాచి పెట్టిన వైనం బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు