అమెరికా సెక్స్ స్కాం డొంక క‌దిలిందిలా!

అమెరికా సెక్స్ స్కాం డొంక క‌దిలిందిలా!

అమెరికాలో సినీ న‌టీమ‌ణుల‌తో జ‌రుపుతున్న సెక్స్ రాకెట్ బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. సంచ‌ల‌నంగా మారిన ఈ వ్య‌వ‌హారంలో అతి కీల‌క‌మైన అంశంగా.. ఈ వ్య‌వ‌హారం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న‌దే.  అధికారుల క‌ళ్లు క‌ప్పి కిష‌న్.. చంద్ర‌క‌ళ దంప‌తులు ఆడిన నాట‌కంలో వారు చేసిన త‌ప్పు వారిని దొరికిపోయేలా చేసింది.

అమెరికాలోని ప్ర‌ముఖ తెలుగు సంఘాల పేరుతో ఉన్న లెట‌ర్ హెడ్స్ ను త‌యారు చేసి.. వాటితో ప్రోగ్రామ్స్ జ‌రుగుతున్న‌ట్లుగా క‌ల‌ర్ ఇస్తారు. ముందుగా మాట్లాడుకున్న తార‌ల్ని ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌టానికి.. అతిధులుగా ఆహ్వానిస్తున్న‌ట్లుగా ఆఫ‌ర్ లెట‌ర్స్ పంపుతారు.

వీటిని ప‌ట్టుకొని వ‌చ్చే కొంద‌రు తార‌లు.. ముందుగా అనుకున్న డీల్ ప్ర‌కారం విటులకు సంతోషాన్ని మిగిల్చి.. కిష‌న్ దంప‌తులు ఇచ్చిన మొత్తాన్ని ప‌ట్టుకొని వెళ్లిపోతారు. పక్కాగా ఉన్న ఈ డీల్ ను పోలీసులు ఎలా క‌నిపెట్టారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని వెతికితే.. కిష‌న్ దంప‌తులు చేసిన ఒక త‌ప్పు వారిని దొరికిపోయేలా చేసింది.

కిష‌న్ దంప‌తుల ఉచ్చులో ప‌డిన ఒక న‌టి 2017 న‌వంబ‌రు 8న అమెరికాలో ఒక తెలుగు సంఘం కాలిఫోర్నియాలో నిర్వ‌హించిన స్టార్ నైట్ కార్య‌క్ర‌మంలో అటెండ్ కావాల్సి ఉంది. ఈవెంట్ నిర్వాహ‌కుల నుంచి వ‌చ్చిన లేఖ ఆధారంగా వీసాతో అమెరికాకు వ‌చ్చారు. అయితే.. స్టార్ నైట్ కార్య‌క్ర‌మం జ‌రిగిన రెండు రోజుల‌కు కాలిఫోర్నియాకు వ‌చ్చారు. అక్క‌డ నుంచి చికాగోకు వ‌చ్చారు.

ఈ వ్య‌వ‌హారం అమెరికా అధికారుల‌కు అనుమానాన్ని క‌లిగించింది. ఆ న‌టిని ప్ర‌శ్నించ‌గా.. తాను గ‌తంలోనూ అమెరికాకు వ‌చ్చిన‌ట్లుగా చెప్పింది. ఆ కార్య‌క్ర‌మం వివ‌రాల్ని స‌ద‌రు న‌టిని అడిగారు. అనుమానం వ‌చ్చిన అధికారులు ఆమెను మ‌రిన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో ఇల్లినాయ్ రాష్ట్రంలోని స్కాంబ‌ర్గ్ లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి తాను హాజ‌రు కావాల్సి ఉంద‌ని చెబుతూ.. దానికి సంబంధించిన లేఖ‌ల్ని అధికారుల‌కు అందించారు.

వెంట‌నే వారు స‌ద‌రు సంస్థ నిర్వాహ‌కుల‌ను సంప్ర‌దించారు. అస‌లు ఆ రోజు అలాంటి కార్య‌క్ర‌మం ఏదీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో.. వెంట‌నే ఆ న‌టిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్ర‌శ్నించ‌గా.. కిష‌న్ దంప‌తులు చేసే దందా గురించి చెప్పుకొచ్చింది. ఆ వివ‌రాల్ని ఆధారంగా చేసుకున్న పోలీసులు మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌గా అధికారుల అనుమానాలు నిజ‌మ‌య్యాయి. దీంతో కోర్టు అనుమ‌తి తీసుకొని చంద్ర‌క‌ళ ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు చేసే చీక‌టిదందాకు సంబంధించిన ప‌లు ఆధారాలు ల‌భించిన‌ట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు