కావల్సిన ఖాకీని తెచ్చుకున్నారా

కావల్సిన ఖాకీని తెచ్చుకున్నారా

ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి కిరణ్‌. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తరువాత త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తమకు అనుకూలమైన అధికారులనే పోస్టింగ్‌ చేసుకుంటున్నారట సిఎం సారు.

ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 45 మంది పోలీస్‌ ఉన్నతాధికారులను బదిలీచేసింది ప్రభుత్వం. వచ్చే రెండు  సంవత్సరాల వరకు వీరే ఆ పొజిషన్లలో కొనసాగుతారు. అయితే ముఖ్యమంత్రి ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాలపై చాలా విమర్శలు ఎదురౌతున్నాయి. కేవలం తనకు అనుకూలమైన అధికారులనే సిఎం కావాల్సిన చోటకి తెచ్చుకున్నారనే వాదన వినిపిస్తోంది.

హైదరాబాదులో తనకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది ఐపిఎస్‌లను సాగనంపారని తెలుస్తుంది. కావల్సిన ఖాకీని కావల్సిన చోటకి తెచ్చుకున్నారుకాని, అసలు దీనివలనే ఒరిగే లాభమేంటి? ఇకపోతే ఈ బదిలీలలో ఎవ్వరికీ పెద్దగా ప్రమోషన్లు కలిపించకపోవడం కిరణ్‌ ప్రత్యేకత.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు