భార్య పోటీపై అకిలేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

భార్య పోటీపై అకిలేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

నీతులు చెబుతాం కానీ పాటించ‌మ‌న్న‌ట్లుగా ఉంటుంది రాజ‌కీయ‌నేత‌ల తీరు. ఎన్ని క‌బుర్లైనా చెబుతాం కానీ.. త‌మ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరు క‌నిపిస్తుంది. ఇందుకు భిన్నంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

త‌మ కుటుంబ స‌భ్యులు పెద్ద ఎత్తున వివిధ ప‌ద‌వుల్లో ఉండ‌టంపై అఖిలేశ్ పై ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. అఖిలేశ్ కుటుంబానికి సంబంధించి 12 మంది స‌భ్యులు ఎంపీ మొద‌లు కొని కో-ఆప‌రేటివ్ సొసైటీల వ‌ర‌కూ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దీనిపై అఖిలేశ్ ను అంద‌రూ త‌ప్పు పడుతున్నారు. ఈ త‌ర‌హా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌నుకుంటున్న అఖిలేశ్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు.

ప్ర‌స్తుతం క‌నౌజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్ స‌భ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌న స‌తీమ‌ణి డింపుల్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ని తేల్చి చెప్పారు. త‌మ పార్టీ అశ్రిత ప‌క్ష‌పాతానికి పాల్ప‌డుతోంద‌న్న ఆరోప‌ణ‌ల్ని తిప్పి కొట్టేందుకే తానీ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెప్పారు.

త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన అఖిలేశ్‌.. వెంట‌నే బీజేపీ కూడా ఇదే విధానాన్ని అనుస‌రించాల‌న్నారు. క‌న్నౌజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని.. ములాయం సింగ్ మొయిన్ పురి..అజంగ‌ఢ్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. మ‌రి.. అఖిలేశ్ నిర్ణ‌యంపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు