అందుకు సిద్ధంగా లేను -ఇలియానా

అందుకు సిద్ధంగా లేను -ఇలియానా

టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ టైంలోనే స్టార్ హీరోయన్ రేంజికి వెళ్లింది ఇలియానా. వరసగా పెద్ద హీరోల పక్కన ఛాన్సులు రావడంతో టాప్ హీరోయిన్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్ల తరవాత టాలీవుడ్ బోర్ కొట్టేసిందంటూ తట్టాబుట్టా సర్దుకుని ముంబయికి మకాం మార్చింది. మొదట్లో బర్ఫీలాంటి మంచి సినిమా వచ్చినా ఆ తరవాత ఈ గోవా బ్యూటీకి అంతగా ఛాన్సులేమీ రాలేదు.

అడపాదడపా వస్తున్న ఛాన్సులతోనే బాలీవుడ్ లో కెరీర్ కష్టంమీద కంటిన్యూ చేస్తూ వచ్చింది ఇలియానా. కెరీర్ అనుకున్న విధంగా సాగకపోవడంతో ఒకానొక టైంలో డీలా పడిపోయింది. అదే టైంలో ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాపర్ ఆండ్రూస్ తో ఆమెకు పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారాడంతో అతడితో కలిసి జీవిస్తోంది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని బాలీవుడ్ జనాలు చెబుతున్నా ఇలియానా అవునని.. కాదని ఏమీ చెప్పకుండా ఉండిపోయింది. రీసెంట్ గా ఇలియానా ప్రెగ్నెంట్ కూడా అయిందనే టాక్ వచ్చింది.

తాను ప్రెగ్నెంట్ అయ్యానన్న న్యూస్ పై ఎట్టకేలకు గోవా సుందరి రియాక్టయింది. ‘‘నేను ప్రెగ్నెంట్ ను కాదు. అయితే ఆ విషయం ఆనందంగా చెబుతాను. నేనూ ఎప్పటినుంచో దీని గురించి ఆలోచిస్తున్నాను. కానీ దానికి ఇంకా టైం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇఫ్పుడు ప్రెగ్నెంట్ అవడానికి నేనెంతమాత్రమూ సిద్ధంగా లేను’’ అంటూ క్లియర్ కట్ గా చెప్పేస్తోంది.  ప్రస్తుతం ఈ భామ బాయ్ ఫ్రెండ్ తో ఫిజీలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు