ఢిల్లీలో జ‌గ‌న్‌.. బీజేపీ రిలేష‌న్ బ‌ట్ట‌బ‌య‌లైంది

ఢిల్లీలో జ‌గ‌న్‌.. బీజేపీ రిలేష‌న్ బ‌ట్ట‌బ‌య‌లైంది

ఏపీ అధికార‌ప‌క్షాన్ని ఏదో విధంగా దెబ్బ తీసేందుకు వేస్తున్న మాస్ట‌ర్ ప్లాన్లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పైకి మాత్రం త‌మ‌కేం సంబంధం లేద‌న్న‌ట్లుగా  బీజేపీ.. జ‌గ‌న్ పార్టీలు చెబుతున్న‌వ‌న్నీ ఉత్త మాట‌లుగా తేలిపోతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ ఇరు పార్టీల‌కు చెందిన నేత‌లు బీజేపీ ముఖ్య‌నేత‌తో సీక్రెట్ గా స‌మావేశ‌మైన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు హ‌డావుడి చేస్తున్నాయి.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును దెబ్బ తీసేందుకు వీలుగా బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ర‌హ‌స్య స్నేహం న‌డుస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి.

అయితే.. వీటిని ఈ రెండు పార్టీల‌కు చెందిన నేత‌లు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ రాష్ట్ర ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ ఛైర్మ‌న్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ రెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌లు క‌లిసి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్‌తో భేటీ అయిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బీజేపీ.. టీడీపీల మ‌ధ్య బంధం క‌టీఫ్ అయిన నాటి నుంచి ఏపీ స‌ర్కారును ఏదోలా టార్గెట్ చేయాల‌ని బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం త‌హ‌త‌హ‌లాడుతోంది.

బాబు స‌ర్కారును త‌ప్పు ప‌ట్టేందుకు వీలుగా ఉండే అంశాలు ఏమిట‌న్న దానిపై భారీ క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున తెర వెనుక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. టీడీపీ ప‌వ‌ర్లోకి వ‌చ్చాక పోల‌వ‌రం.. ప‌ట్టిసీమ‌.. అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి అవినీతి జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీంతో.. వాటికి సంబంధించిన ఆధారాలు త‌మ‌కు ఇవ్వాల‌ని బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం కోరిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌జాప‌ద్దుల క‌మిటీ ఛైర్మ‌న్ హోదాలో తాను సంపాదించిన వివ‌రాల్ని బుగ్గ‌న బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వానికి అందించినట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. బుగ్గ‌న‌.. ఆకుల క‌లిసి రాంమాధవ్ ఇంటికి వెళ్ల‌టానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. జ‌గ‌న్ చెప్పిన మీద‌టే బుగ్గ‌న బీజేపీ నేత‌ల్ని క‌లిశార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటోలు చాలు.. బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అక్ర‌మ సంబంధానికి ఆధార‌మంటున్నారు.

ఈ ఆరోప‌ణ‌ల మీద అటు బీజేపీ నేత‌లు.. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఖండించారు. బుగ్గ‌న‌ను తాను ఏపీ భ‌వ‌న్ లో క‌లిసింది నిజ‌మే అయినా.. ఆయ‌న‌తో క‌లిసి బీజేపీ నేత‌ల‌తో భేటీ అయ్యానంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని చెబుతున్నారు. బుగ్గ‌న క‌లిసిన‌ప్పుడు స్నేహితుడిగానే ఆయ‌న్ను ప‌లుక‌రించానే త‌ప్పించి అందులో ఎలాంటి రాజ‌కీయం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత‌ల‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎవ‌రూ స‌మావేశం కాలేద‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా వివ‌ర‌ణ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాను ఆకుల‌తో భేటీ అయిన వైనంపై బుగ్గ‌న ఖండిస్తూ.. తాను షాంగ్రిలా హోట‌ల్లో దిగాన‌న్నారు. ఏపీ భ‌వ‌న్‌లో ఆకుల ఎదురుప‌డితే ప‌లుక‌రించానని.. క‌లిసి భోజ‌నం చేశాన‌న్నారు. ఆకుల ప్ర‌ముఖ వైద్యుడ‌ని.. ఆయ‌నంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌న్నారు.  ఇన్ని వివ‌ర‌ణ‌లు ఇస్తున్నా.. రాంమాధ‌వ్ ఇంటి ద‌గ్గ‌ర బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు వెళ్ల‌టానికి సంబంధించిన ఫోటోల మాట ఏమిట‌న్నది స్పందించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు