ప్ర‌ధాని ఫిట్ నెస్ ఛాలెంజ్‌పై సెటైర్లు పేలుతున్నాయి

ప్ర‌ధాని ఫిట్ నెస్ ఛాలెంజ్‌పై సెటైర్లు పేలుతున్నాయి

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఇంట‌ర్నెట్‌లో ఒక బ‌జ్ ను క్రియేట్ చేసింది. కానీ ఇంత‌కు మునుపటి మోడీ ప‌నుల్లా రెస్పాన్స్ పాజిటివ్ మాత్రం కాదు. ఈసారి మోడీ ఛాలెంజ్‌పై కావాల్సినంత ఫ‌న్ క్రియేట్ అయ్యింది. ఇంట‌ర్నెట్లో మోడీ ఫీట్లు ఊర్లో తొక్కుడు బిళ్ల‌తో పోల్చి చేసిన‌ మెమీస్ ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.  కొంద‌రు ప్రియావారియ‌ర్ క‌న్నుగొడితే మోడీ ఫ్లాట్ అంటూ ఇమేజ్‌ల‌తో మంచి ఫ‌న్ క్రియేట్ చేశారు. ఇంకా బోలెడు ట్రోల్స్‌తో మోడీ భ‌క్త్ ల‌కు పిచ్చెక్కిస్తోంది ఇంట‌ర్నెట్‌.

అయితే, తాజాగా ప్రధాని మోదీ చేసిన ఫిట్ నెస్ ఛాలెంజ్ పై ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ సెటైర్లు పేల్చారు. పాల‌కులు పెంచాల్సింది బుర్ర‌ను... కండ‌ల‌ను కాదు.  విమర్శలు చేశారు.  ప్ర‌ధాని మోడీని కుస్తీ పోటీల కోసం ఎన్నుకోలేదు. దేశాన్ని త‌న తెలివితేట‌ల‌తో ముందుకు తీసుకెళ్తార‌ని ఎన్నుకున్నారు.  కానీ ఆయ‌నేమో త‌న బుర్ర‌ను బ్యాంకులను దోచుకున్న వారిని కాపాడటానికి వాడుతున్నారు అని వ్యాఖ్యానించారు.  

ఈ సంద‌ర్భంగా క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం విముఖ‌త వ్య‌క్తంచేయ‌డంపై కూడా జూపూడి స్పందించారు. జ‌గ‌న్ మోడీని చంకనెక్కించుకున్నారు.  కానీ మోడీ ఏమో జ‌గ‌న్ సొంత జిల్లాకు హ్యాండించారు. అయినా జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌డానికి భ‌య‌ప‌డుతున్నాడు. స్టీల్ ప్లాంట్ విషయమై వైసీపీ అధినేత జగన్ స్పందించ‌క‌పోవ‌డంలో ఆంత‌ర్యం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చివ‌ర‌కు క‌న్నాపై కూడా స్ట్రాంగ్ సెటైర్ వేశారు జూపూడి. కన్నా బీజేపీకి అధ్య‌క్షుడు, జ‌గ‌న్‌కు ఏజెంట్ అని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు