ఢిల్లీకి కేసీఆర్‌..ఈసారైనా మోడీ క‌రుణించేనా?

ఢిల్లీకి కేసీఆర్‌..ఈసారైనా మోడీ క‌రుణించేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మ‌రోమారు ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారు. గురువారం ఆయ‌న ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కానున్నారని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి.. మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ భేటీలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారని చెప్తున్నారు. అయితే, ఈ ద‌ఫా అయినా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ద‌ర్శ‌న భాగ్యం ద‌క్కుతుందా అని ప‌లువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే ప‌దిహేను రోజుల కింద‌ట ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌...నిరాశ‌గా తిరిగివ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన  ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సమావేశం నిర్వ‌హించి ఆమోద ముద్ర వేశారు. అయితే దీనికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చే ప్ర‌క్రియలో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యారు. ఆయ‌న‌కు మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. మోడీ అపాయింట్‌మెంట్ తీసుకోకుండా వెళ్ల‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌నే చ‌ర్చ జ‌రిగింది. ఢిల్లీ మీడియా వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌ధాని మోడీ రెండు రోజుల పాటు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నందున అపాయింట్‌మెంట్ కుద‌ర‌లేదు.

ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే...రాజ‌కీయ‌కార‌ణాల వ‌ల్ల ఈ భేటీ కుద‌ర‌లేద‌ని అంటున్నారు. ఎందుకంటే...కేసీఆర్ క‌ల‌లు కంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎత్తుగ‌డ అడ్డంకిగా మారింద‌ట‌. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని కోరిన కేసీఆర్ ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను కూడా మొదలుపెట్టి ప‌లువురు నేత‌ల‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా కేసీఆర్ క‌లిసిన నాయ‌కులంతా ప్ర‌ధాని మోడీపై భ‌గ్గుమంటున్న వారే! ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ, జేడీఎస్ నాయ‌కుడు దేవెగౌడ, క‌న్న‌డ నేల‌పై షాకిచ్చిన కుమార‌స్వామి, డీఎంకే ర‌థ‌సార‌థులు కుర‌ణానిధి, స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌ వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. ఫ్రంట్ ఆలోచ‌న చేసి ఈ నేత‌ల‌ను క‌లిసిన అనంత‌రం కేసీఆర్ చేసి ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మొద‌టి సారి షాక్ ఎదుర‌వ‌గా...తాజాగా ఏమ‌వుతుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు