బిగ్ బాస్ -2లో నాని - క‌త్తి రివ్యూ

బిగ్ బాస్ -2లో నాని - క‌త్తి రివ్యూ

గ‌త ఆదివారం ప్రారంభ‌మైన బిగ్ బాస్ -2 షో ప్రేక్ష‌కుల‌కు స‌రిపడినంత కిక్ ఇవ్వ‌లేద‌ని టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. షోలో పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ పార్టిసిపెంట్లు లేర‌ని...అంత ఆస‌క్తికంగా షో సాగడం లేద‌ని వీక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దానికితోడు ఎన్టీఆర్ త‌ర‌హాలో నేచుర‌ల్ స్టార్ నాని.... పార్టిసిపెంట్ల‌తో పాటు వీక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయారని అనుకుంటున్నారు. అయితే, రెండు రోజులు చూసి షోను జ‌డ్జ్ చేయ‌డం స‌రికాద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.

మొత్తానికి తొలి వారంలో షోపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో నాని యాంక‌రింగ్ పై ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల్లో న్యాచుర‌ల్ యాక్టింగ్ మాదిరిగా.....బిగ్ బాస్-2లో నాని యాంక‌రింగ్ స‌హ‌జంగా లేద‌ని, పార్టిసిపెంట్ల‌తో నాని మ‌మేకం కాలేక‌పోతున్నార‌ని మ‌హేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. పార్టిసిపెంట్ల‌తో నాని ఆచితూచి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోంద‌ని....వీక్ష‌కుల అంచ‌నాల‌ను నాని అందుకోలేక‌పోయాడ‌ని అన్నారు. తారక్ తో పోలిస్తే...నాని షోను ర‌క్తి క‌ట్టించ‌లేక‌పోతున్నాడ‌ని క‌త్త మ‌హేష్ అభిప్రాయ‌ప‌డ్డారు.

వాస్త‌వానికి నాని న్యాచుర‌ల్ స్టార్ అని, కానీ, బిగ్ బాస్ -2 షో యాంక‌రింగ్ లో న్యాచుర‌ల్ నెస్ లేకుండా పోయిందని క‌త్తి మ‌హేష్ అన్నారు. త‌న సినిమాల్లోలాగా స‌హ‌జ‌సిద్ధంగా నాని యాంక‌రింగ్ చేయ‌లేద‌ని అభిప్రాయ‌పడ్డారు. నాని....నానిలాగే ఉంటే ఇంకా ఎక్కువ ఫ‌న్ ఉండేద‌న్నారు. ఎక్క‌డో బిగుసుకుపోయాడేమో, ఎక్క‌డో ఆలోచిస్తున్నాడేమో....ఆలోచించి మాట్లాడుతున్నాడేమో....మ‌నుషుల మ‌ధ్య ఇంట‌రాక్ష‌న్ అంత ఫెమిలియ‌ర్ గా ఉండ‌డం లేదేమో....అనిపించింద‌న్నారు. తార‌క్ మొద‌ట్లో కొద్దిగా ఇబ్బందిప‌డ్డా.....ఆ త‌ర్వాత త‌న స‌హ‌జ ధోర‌ణిలో షో చేయ‌డం వ‌ల్ల అంద‌రికీ న‌చ్చింద‌న్నారు.

సినిమాల్లో తార‌క్ క్యారెక్ట‌ర్స్ వేరేమో గానీ....నేచుర‌ల్ గా మ‌నుషుల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొని, వారితో క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వం ఉందని...ఆ ర‌కంగా వీక్ష‌కుల‌కు ....తార‌క్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంద‌ని చెప్పారు. నిజ జీవితంలో కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన నాని....పార్టిసిపెంట్లతో చాలా క్లోస్ గా చాలా ఫ‌న్నీగా ఉంటాడేమో.... అనే అంచ‌నాలు ప్ర‌తి ఒక్క‌రికీ ఉన్నాయ‌ని....కానీ నాని వాటిని అందుకోలేక‌పోయాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English