కిమ్ అంత ఆస‌క్తిగా ట్రంప్ కారును చూశారెందుకు?

కిమ్ అంత ఆస‌క్తిగా ట్రంప్ కారును చూశారెందుకు?

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ ల మ‌ధ్య భేటీ సంద‌ర్భంగా ప‌లు విశేషాలు చోటు చేసుకున్నాయి. మిగిలిన వాటి సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇరువురు అధినేత స‌మావేశం ముగిసిన త‌ర్వాత‌.. హోట‌ల్ ఆవ‌ర‌ణ‌లో ఇరువురు అధినేత‌లు ప‌చార్లు చేశారు.

ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు వినియోగించే బీస్ట్ కారును కిమ్‌కు ట్రంప్ స్వ‌యంగా చూపించారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఈ కారును ట్రంప్ క‌నుసైగ‌తో అమెరిక‌న్ సీక్రెట్ స‌ర్వీస్ అధికారులు కారు డోరును తెరిచారు. కారు ప్ర‌త్యేక‌త‌ల్ని కిమ్‌కు ట్రంప్ వివ‌రించారు.

దీంతో.. అమెరికా అధ్య‌క్షుడు వినియోగించే బీస్ట్ కారు మీద ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. అమెరికా అధ్య‌క్షుడి లాంటి వ్య‌క్తి వాడే కారు అంటే.. అందులో బోలెడ‌న్ని ప్ర‌త్యేక‌త‌లు ఉండ‌టం ఖాయం. ఇంత‌కీ బీస్ట్ స్పెషాలిటీస్ ఏమిట‌న్న‌ది చూస్తే.. బీస్ట్ 8 ట‌న్నుల బ‌రువుతో ఉంటుంది. అమెరికా అధ్య‌క్షుడు వినియోగించేందుకు ప్ర‌త్యేకంగా త‌యారు చేయించారు. 8 అంగుళాల మందంతో ఉండే ఈ కారు బాడీ స్పెషాలిటీ ఏమిటంటే 5 అంగుళాల బుల్లెట్ ప్రూఫ్ ర‌క్ష‌ణ‌తో త‌యారు చేసింది కావ‌టం.

కారు అద్దాలు సైతం బుల్లెట్ ఫ్రూవ్ తో త‌యారైన‌వే. ర‌సాయ‌నిక దాడుల నుంచి సైతం త‌ట్టుకునేలా ఈ కారును రూపొందించారు. బోయింగ్ 747 విమానం ఎంత బ‌లంగా త‌యారు చేస్తారో.. అంతే స‌మాన శ‌క్తితో ఉండేలా బీస్ట్ త‌లుపుల్ని తయారు చేయ‌టం విశేసషం. నాణ్య‌మైన ఉక్కుతో త‌యారు చేసిన ఈ కారు చ‌క్రాల‌కు ఉప‌యోగించే టైర్లు ప్ర‌త్యేక‌మైన‌వి. ఈ టైర్లు పంక్చ‌ర్ అయ్యే గుణమే ఉండ‌దు. ఒక‌వేళ అనుకోని రీతిలో ఈ కారు టైర్లు పంక్చ‌ర్ అయిన‌ప్ప‌టికీ.. కారును ఆపాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఈ కారులో వినియోగించే ఇంధ‌నం విష‌యంలోనూ ప్ర‌త్యేక‌త‌లు ఉంటాయి. కారులో పూర్తిస్థాయి ఇంధ‌నాన్ని నింపిన‌ప్ప‌టికీ అగ్నిప్ర‌మాదానికి ఆస్కారం లేని రీతిలో ప్ర‌త్యేక‌మైన ఫోమ్ లాంటి దాన్ని వినియోగిస్తారు. భ‌ద్ర‌తా ప‌రంగా వంక చూపించ‌లేని ఈ కారు అత్యంత దుర్భేద్యంగా త‌యారు చేసిన‌ట్లుగా అభివ‌ర్ణిస్తారు.

ఏదైనా అత్య‌వ‌స‌ర‌మైతే..కారులో నుంచి కూడా ప్రసంగించేలా ఏర్పాట్లు ఉన్నాయి. మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న ఈ కారును ఏ కంపెనీ త‌యారు చేసిందంటే.. ఏ కంపెనీకి ఆ క్రెడిట్ లేదు. కారులోని ఒక్కోపార్ట్ ను ఒక్కో కంపెనీని నుంచి న‌మూనాగా తీసుకొని ప్ర‌త్యేకంగా త‌యారు చేయ‌టం బీస్ట్ స్పెషాలిటీగా చెబుతుంటారు. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి కాబ‌ట్టే.. త‌న‌కారును కిమ్ కు ప్ర‌త్యేకంగా ట్రంప్ చూపించ‌గా.. ఆయ‌న సైతం అంతే ఆస‌క్తిగా కారు లోప‌ల‌కు వెళ్లి మ‌రీ చూసిన‌ట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English