ఇండియా వీక్‌నెస్ మీద కొట్టిన బ్రిట‌న్‌

ఇండియా వీక్‌నెస్ మీద కొట్టిన బ్రిట‌న్‌

దేశంలోని అనేక బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌లు ఎగ‌వేసిన కింగ్ ఫిష‌న్ అధినేత విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీలు బ్రిట‌న్ లో త‌ల‌దాచుకుంటున్న విష‌యం తెలిసిందే. వీరిని భార‌త్ కు అప్ప‌గించాల‌ని బ్రిట‌న్ ను కోర‌గా కొత్త మెలిక‌ల‌తో బ్రిట‌న్ పెద్ద షాకే ఇచ్చింది. త‌ద్వారా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటన్ గండికొట్టింది.

బ్రిటన్‌లో 75 వేల మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు భారతీయులే. వారందరినీ దేశం నుంచి పంపించేందుకు సహకరిస్తేనే నీర‌వ్ మోదీ, విజ‌య్ మాల్యాల‌ను అప్ప‌గిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. తమ దేశంలోని అక్రమ వలసదారులను బహిష్కరించే విషయంలో తమ వాదనను గౌరవించకపోతే బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయంలో పునరాలోచించుకోవాల్సి వస్తుందని చెప్ప‌డం గ‌మ‌నార్హం.  బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్ సోమవారం కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో మాట్లాడిన సంధ‌ర్భంగా ఈ విష‌యం చెప్పిన‌ట్లు స‌మాచారం.

దేశంలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న వలసదారుల బహిష్కరణపై బ్రిటన్ ప్రభుత్వం ఓ ముసాయిదాను రూపొందించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ అవగాహన పత్రంపై సంతకం చేయలేదు. దీనినే ప్ర‌స్తుతం బ్రిట‌న్ విదేశాంగ శాఖ భార‌త్ ముందు ఉంచిన‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి నీర‌వ్, మాల్యాల‌ను భార‌త్ కు తీసుకువ‌చ్చే విష‌యంలో ఈ లెక్క‌న ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌ని తాజా ప‌రిణామాలు తేల్చిచెబుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English