మానసిక ఒత్తిడితో ఆధ్యాత్మిక గురూ ఆత్మహత్య!

మానసిక ఒత్తిడితో ఆధ్యాత్మిక  గురూ ఆత్మహత్య!

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన  ఆధ్యాత్మిక  గురూ భయ్యూజీ మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. త‌న ఆశ్రమంలో తుపాకీతో  కాల్చుకొని త‌నువు చాలించారు. నిత్యం ప్రజలకు ఆధ్యాత్మికత, ప్రశాంతత గురించి బోధించే వారు భయ్యూజీ. మనస్సు ప్రశాంతంగా ఉండాలని.. ప్రకృతిని ప్రేమించాలని.. అప్పుడే మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుందని భక్తులకు హితబోధ చేస్తుంటారు భయ్యూజీ. అందులో భాగంగా నర్మదా నది ప్రక్షాళన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నదులు మనిషి మనుగడలో భాగం అని.. వాటిని ప్రేమించాలని ప్రచారం చేశారు. ఎప్పుడూ అహింత, ప్రశాంతత గురించి ప్రసంగిస్తూ.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెబుతూ ఉంటారు భజ్యూజీ. అలాంటి ఆధ్యాత్మిక గురువే.. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవటం ఆయన భక్తులనే కాకుండా.. మధ్యప్రదేశ్ ప్రజలను నివ్వెరపరిచింది.

భయ్యూజీ గత కొంతకాలంగా తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆయ‌న ఆశ్రమంలో తుపాకీతో  కాల్చుకున్నాడు. స్వామిజీని వెంటనే ఇండోర్ బాంబే ఆస్పత్రికి ఆయన శిష్యులు తరలించారు. అప్పటికే  భయ్యూజీ  మృతి చెందినట్లు డాక్లర్లు తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం కేబినెట్ హోదాలో మంత్రి పదవి ఇచ్చినా వద్దన్నారు. భయ్యూజీకి రీసెంట్‌గా నర్మదా నది  ప్రక్షాళన  బోర్డులో భాగంగా.. శివరాజ్ సింగ్  చౌహాన్  సర్కార్  కేబినెట్  హోదా కల్పించింది. దీనిని  భయ్యూజీ  తిరస్కరించారు.  ప్రజలకు  చేరువయ్యేందుకు  పదవులు  అవసరం లేదని ప్రకటించి.. ప్రజలకు భయ్యూజీ మరింత దగ్గర అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు