'గ‌నులు తిని బ‌తికారుగా జ‌గ‌న్‌'

'గ‌నులు తిని బ‌తికారుగా జ‌గ‌న్‌'

వైఎస్ జ‌గ‌న్ ఈ మ‌ధ్య స్ట్రాట‌జీ మార్చారు. త‌న మీద అవినీతి ముద్ర ఎలాగూ పోగోట్టుకోలేం కాబ‌ట్టి... ఇతరుల మీద ఆ ముద్ర వేస్తే ఇక దాని గురించి ఆలోచించాల్సిన ప‌నే ఉండ‌ద‌నుకున్నారో ఏమో త‌న పాద‌యాత్ర గుంటూరుకు చేరిన‌ప్ప‌టి నుంచి అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల ప‌శ్చిమ‌గోదావ‌రిలో ప‌ర్య‌టిస్తూ అధికార తెలుగుదేశం నేత‌ల‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. జ‌గ‌న్ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే ఏపీ సంప‌ద కంటే ఆయ‌న ఆరోప‌ణ‌లో లెక్క‌లే ఎక్కువున్నాయి. ప‌శ్చిమ‌లో జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌లపై లోకేష్ ఘాటుగా స్పందించారు.

*అవినీతి గురించి జ‌గ‌న్ మాట్లాడ‌టం ఒక పెద్ద జోక్‌! దోచుకోవ‌డానికి ఈ రాష్ట్రంలో ఏమైనా మీరు మిగిలిస్తే క‌దా. ఇసుక, ఖ‌నిజాలు, బాక్సైట్, లైమ్‌స్టోన్ ఇలా దేన్నీ వ‌ద‌ల్లేదు. మీరు తిన్న మెను గురించి మీకేమైనా డౌట్లుంటే.. సీబీఐ దాఖ‌లు చేసిన 13 ఛార్జిషీట్లు తిర‌గేయండి* అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఏ1 అంటూ సంబోధిస్తూ జ‌గ‌న్ ఆరోప‌ణ‌లకు సంబంధించిన ఒక ఆంగ్ల ప‌త్రిక స్క్రీన్‌షాట్ ను కూడా అటాచ్ చేశారు.

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఈరోజు తూర్పుగోదావ‌రిలో ప్ర‌వేశిస్తోంది. ఈరోజుతో ప‌శ్చిమ గోదావ‌రి ప‌ర్య‌ట‌న ముగియ‌నున్న నేప‌థ్యంలో అన్నిటికీ ఒకేసారి స్పందిద్దాం అని లోకేష్ ఆగిన‌ట్టుంది. స‌రిగ్గా జిల్లాలో యాత్ర ముగిసే రోజున గ‌ట్టి కౌంట‌ర్‌తో జ‌గ‌న్‌ను లోకేష్ ఎదుర్కొన్నారు. ట్విట్ట‌రులో చాలా కాలంగా లోకేష్ చాలా యాక్టివ్‌గా ఉంటూ సామాన్యుల ట్వీట్ల‌కు కూడా స్పందిస్తూ వ‌స్తున్నారు. అపుడ‌పుడు మోడీని, ప్ర‌తిప‌క్షాల‌ను ట్వీట్ల‌తో ఫైరింగ్ చేస్తూన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English