ట్రంప్‌.. కిమ్ మీటింగ్ కోసం సింగ‌పూర్ చేసిన ఖ‌ర్చు ఎంతంటే?

ట్రంప్‌.. కిమ్ మీటింగ్ కోసం సింగ‌పూర్ చేసిన ఖ‌ర్చు ఎంతంటే?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన మీటింగ్ జ‌రిగిపోయింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ ల భేటీకి సంబంధించిన విశేషాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. వీరిద్ద‌రి మీటింగ్ కోసం సింగ‌పూర్ ను వేదిక‌గా చేసుకోవ‌టం తెలిసిందే.

ఉత్త‌ర‌కొరియాతోనూ.. అమెరికాతోనూ స‌న్నిహిత సంబంధాలు ఉన్న అతి కొద్ది దేశాల్లో సింగ‌పూర్ ఒక‌టి. దీంతో.. వీరిరువురి భేటీకి సింగ‌పూర్ భేటీ అయ్యింది. ప్ర‌పంచానికే పెద్ద‌న్న లాంటి అమెరికాకు ఒక ప‌ట్టాన లొంగ‌ని ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు భేటీ ముందుకు రావ‌టం.. అందుకు ప్ర‌తిగా ట్రంప్ సైతం ఓకే అన‌టంతో చారిత్ర‌క భేటీ వాస్త‌వ రూపం దాల్చింది.
ఉత్త‌ర కొరియాను పూర్తిగా అణు నిరాయుధీక‌ర‌ణ‌ను ట్రంప్ కోరుతున్నారు. అదే స‌మ‌యంలో త‌మ దేశం మీద విధించిన ఆంక్ష‌ల్ని పూర్తిగా ఎత్తి వేయాల‌ని కిమ్ ప‌ట్టుప‌డుతున్నారు. ఇలాంటి వేళ‌.. వీరిద్ద‌రి భేటీ ఆస‌క్తిక‌రంగా మారింది.  తొలుత ట్రంప్‌.. కిమ్ లు ఇద్ద‌రూ ఏకాంతంగా భేటీ కానున్నారు. అనంత‌రం రెండు దేశాల ప్ర‌తినిధుల‌తో క‌లిసి వారు మ‌రోసారి స‌మావేశం కానున్నారు. వీరిద్ద‌రి భేటీని ప్ర‌పంచ దేశాలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి.

ట్రంప్ ఎంత మొండివాడో.. అంత‌కు మించిన అన్న‌ట్లుగా కిమ్ తీరు ఉండ‌టం తెలిసిందే. భిన్న‌ధ్రువాల‌న్న‌ట్లుగా ఉండే రెండు దేశాల‌కు చెందిన అధినేత‌లు భేటీ కావ‌టం ఒక విశేష‌మైతే.. ఈ స‌మావేశంలో ఏదైనా తేడా జ‌రిగితే చోటు చేసుకునే ప‌రిణామాలు తీవ్రంగా ఉండ‌నున్నాయి.

స‌మావేశం స‌రిగా సాగ‌కుంటే తాను మ‌ధ్య‌లోనే వెళ్లిపోతాన‌ని ట్రంప్ ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. అదే స‌మ‌యంలో కిమ్ తీరుపైనా ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ‌.. ట్రంప్‌.. కిమ్ మ‌ధ్య చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మైతే.. కొరియా ద్వీప‌క‌ల్పంలో శాంతి నెల‌కొన‌టం ఖాయమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల చారిత్ర‌క స‌మావేశం కోసం సింగ‌పూర్ ప్ర‌భుత్వం ఏకంగా రూ.100 కోట్లు ఖ‌ర్చు చేయ‌టం విశేషం. ఈ మొత్తం ఖ‌ర్చులో రూ.50 కోట్ల వ‌ర‌కూ కేవ‌లం భ‌ద్ర‌త కోస‌మే వెచ్చించిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రింత ఖ‌రీదైన మీటింగ్ చివ‌ర‌కు ఏమ‌వుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక‌.. ఈ చారిత్ర‌క స‌మావేశాన్ని క‌వ‌ర్ చేయ‌టానికి ప్ర‌పంచ వ్యాప్తంగా 2500 మంది మీడియా ప్ర‌తినిధులు సింగ‌పూర్ కు చేరుకున్నారు. పూర్తిగాపెట్టుబ‌డిదారీ దేశ‌మైన అమెరికా.. అందుకు భిన్నంగా ఏక‌పార్టీ నియంతృత్వంలో మ‌గ్గిపోయిన ఉత్త‌ర కొరియాల మ‌ధ్య చ‌ర్చ‌లు షురూ కావ‌ట‌మే విశేషం. మ‌రి.. తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు