'మోడీ హ‌త్య‌' పై సెటైర్

'మోడీ హ‌త్య‌'  పై సెటైర్

విమ‌ర్శ‌కు ప్ర‌తిగా మ‌రింత ప‌దునైన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత భారీగా ఆరోప‌ణ‌లు చేయ‌టం ఇప్పుడు మామూలైంది. రాజ‌కీయాల్లో మాత్ర‌మే క‌నిపించే ధోర‌ణి ఇప్పుడు అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. ప్ర‌ధాని మోడీ హ‌త్య‌కు మావోలు భారీ ప్లాన్ చేస్తున్నారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం సంచ‌ల‌నంగా మారితే.. ఇదంతా ప‌డిపోయిన గ్రాఫ్ ను పున‌రుద్దుర‌ణ కోస‌మే బీజేపీ ఇలాంటి చౌక‌బారు ప్ర‌చారానికి దిగుతుందంటూ వామ‌ప‌క్ష వాదులు మండిప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఊహించ‌ని రీతిలో షాకింగ్ ట్వీట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది.
ప్ర‌ధాన‌మంత్రి మోడీని హ‌త్య చేసేందుకు మావోలు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా జ‌రుగుతున్న వాద‌న‌కు ఎదురుదాడి అన్న రీతిలో జేఎన్ యూ విద్యార్థిని ఒక‌రు చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌ధాని మోడీ హ‌త్య చేసేందుకు కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ.. సంఘ్ ప‌రివారంలోని ముఖ్య‌నేత‌లు ప్లాన్ చేసిన‌ట్లుగా ర‌షీద్ ట్వీట్ చేశారు.

రాజీవ్ త‌ర‌హాలోనే మోడీని మ‌ట్టుబెట్టాల‌న్న‌ది వారి ప్లాన్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తో పాటు సంఘ్ ప‌రివార్ సైతం కుట్ర చేస్తున్న‌ట్లుగా త‌న‌కు అనిపిస్తోంద‌ని పేర్కొన్నారు. రాజీవ్ త‌ర‌హాలోనే మోడీని చంపాల‌నుకుంటున్నార‌ని.. ఆ ప‌ని చేసి.. ఆ అప‌వాదును ముస్లింల పైకి.. క‌మ్యునిస్టుల పైకి తోయాల‌ని భావిస్తున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. అలా చేశాక‌.. ముస్లింల‌ను ఊచ‌కోత కోస్తారేమో? అంటూ అనుమానాల్ని వ్య‌క్తం చేశారు.

ర‌షీద్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా ఉంటే.. కేంద్ర‌మంత్రుల స్థాయిలో ఉన్న వారిని కించ‌ప‌రిచేలా లేనిపోని క‌న్ఫ్యూజ‌న్ల‌కు గురి చేసేందుకే ఈ త‌ర‌హా ట్వీట్ల దాడి మార్గాన్ని ఎంచుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ట్వీట్ ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీ.. ఈ త‌ర‌హా వికృత వ్యాఖ్య‌లు చేసిన అసాంఘిక శ‌క్తుల‌పైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లుగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మొత్తానికి జేఎన్ యూ విద్యార్థిని ట్వీట్ బీజేపీ అగ్ర నాయ‌క‌త్వానికి షాకింగ్ గా మారిన‌ట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు