కేవ‌లం మ‌హిళ‌లతోనే.. 545 ఎంపీ సీట్లకు పోటీ !

కేవ‌లం మ‌హిళ‌లతోనే.. 545 ఎంపీ సీట్లకు పోటీ !

రిటైర్డ్ జ‌స్టిస్ సీఎస్ క‌ర్ణ‌న్ గుర్తున్నారా? మద్రాస్‌, కోల్‌కతా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన కర్ణ‌న్‌.. కోర్టు ధిక్కరణ చర్య కింద ఆరు నెలలు జైలు శిక్షనెదుర్కొన్న సంగతి తెలిసిందే. రిటైర్డ్‌, ప్రస్తుత న్యాయమూర్తులు అవినీతిపరులంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కర్ణ‌న్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తనకు వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంపైనా ఘాటుగా స్పందించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన బెంచ్‌లోని ఏడుగురు న్యాయమూర్తులనే ఎయిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ డీజీపీని ఆదేశించారు. వైద్య పరీక్షల కోసం తనను బలవంతం చేస్తే బెంగాల్‌ డీజీపీని సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అంతేకాదు.. తన కేసును విచారిస్తున్న చీఫ్‌ జస్టిస్‌ సహా ఏడుగురు న్యాయమూర్తుల విదేశీ ప్రయాణాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలా ర‌చ్చ ర‌చ్చ చేసిన జడ్జిగారు తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు.

సంచలనం, వివాదానికి మారుపేరైన రిటైర్డ్‌ జస్టిస్‌ కర్ణన్ తాజాగా త‌న రాజ‌కీయ ప్ర‌యాణంతో మరోసారి వార్తల్లోకెక్కారు. చెన్నైలోని అంబేద్కర్‌ మెమోరియల్‌ హౌస్‌ వేదికగా శుక్రవారం జరిగిన సభలో పార్టీ పేరు ఊఝాలుక్కా ఎదిరానా సెయాలక్కా కట్చి(యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ)గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి రహిత దేశం కోసమే తమ పార్టీ పోరాట మని తెలిపారు. చెప్పిన మాట ప్రకారమే పార్టీ ప్రారంభించిన ఆయన అదే రీతిలో కీలక ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాల్లో పోటీ చేస్తామని, అన్నింటా మహిళలనే బరిలోకి దించుతామని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.దేశ రాజకీయ వ్యవస్థలో మహిళలపై వివక్ష ఉన్నదని, దీన్ని తాము సరిచేస్తామని చెప్పారు. న్యాయవ్యవస్థ సహా అన్ని శాఖల్లో అవినీతిని రూపుమా పడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని చెప్పారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ జనరల్‌ బాడీ తనను కోరిందని తెలిపారు. కానీ, ఆ స్థానంలో కూడా మహిళా అభ్యర్థినే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు.

కాగా, దేశ‌మంతా మహిళ‌ల‌నే బ‌రిలో ఉంచుతామ‌ని కర్ణన్‌ ప్రకటించడం చర్చాంశనీయంగా మారింది. కాగా, త‌మిళ‌నాడులో పార్టీల ఆవిర్భావం ప‌రంప‌ర‌లో ఈ కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా చేర‌డం గ‌మ‌నార్హం. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో నాలుగో పార్టీ ఆవిర్భావం కావడం గమనార్హం. ఇంతకు ముందు కమల్‌హసన్‌, దీప, దినకరన్‌లు పార్టీలను స్థాపించారు. అదే వ‌రుస‌లో క‌ర్ణ‌న్ పార్టీని ప్రారంభించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English