బయటకొస్తే జగన్‌ కాదు, జైలే

బయటకొస్తే జగన్‌ కాదు, జైలే

చాలామందికి ఒక సందేహం. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులెవ్వరూ ఎందుకు రిజైన్‌ చేసి బయటకు వచ్చేయడం లేదని? విమర్శకులు ఏమంటారంటే, వీరందరూ కాంగ్రెస్‌ను వదిలి బయటకు వస్తే జగన్‌పార్టీలో చేరడం కాయమని, అందుకే వీరిని అదిష్టానం ఎటూ వెళ్ళకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.

అయితే ఇందులో  ఏ మాత్రం నిజంలేదని అనిపిస్తోంది. ఒకవేళ మంత్రులు రిజైన్‌ చేసి బయటకు వస్తే, జగన్‌ పార్టీ ఆఫీసుకు వెళ్ళడమో, లేదా లోటస్‌పాండ్‌కు వెళ్ళి విజయమ్మతో మీటింగులో కూర్చోవడమో చేసేలోపు, సిబిఐ వాళ్ళు అరెస్టు చేసే అవకాశం ఉంది.

అసలు పదవులకు రిజైన్‌ చేసి బయటకు వస్తే, సిబిఐ వాళ్ళు లోపలేస్తారనే మన కళంకిత మంత్రులు తమ పదవులకు గుడ్‌బై చెప్పడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాజీనామ చేశామని చెబుతున్న మంత్రులు రాజీనామాలను ముఖ్యమంత్రి ఎందుకు ఆమోదించడంలేదో ఆయనకే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు