శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్ర‌యాణికుడికి చుక్క‌లు చూపించిన ఓలా

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్ర‌యాణికుడికి చుక్క‌లు చూపించిన ఓలా

క్యాబ్ క‌ష్టాలు న‌గ‌ర జీవుల‌కు త‌ప్ప‌టం లేదు. క్యాబ్ ల ఎంట్రీతో ప్ర‌యాణికుల‌కు సురక్షిత‌మైన ప్ర‌యాణానికి.. భ‌ద్ర‌త‌కు లోటు లేకుండా.. చ‌క్క‌టి ప్ర‌యాణ అనుభూతితో పాటు.. సేవ‌ల విష‌యంలోనూ సంతృప్తి క‌ర స్థాయిలో ఉండేలా వ్య‌వ‌హ‌రిస్తాయ‌ని అనుకున్న క్యాబ్ లు  కాస్తా ఈ మ‌ధ్య‌న త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి.

తాజాగా అలాంటి చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్నారు ఫారిన్ నుంచి తిరిగి వ‌చ్చిన ఒక భార‌తీయుడు. రెండేళ్ల త‌ర్వాత కుటుంబ స‌భ్యుల్ని క‌లుసుకునేందుకు శుక్ర‌వారం మ‌ధ్యాహ్న వేళ‌లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చాడో ప్ర‌యాణికుడు. సౌదీ నుంచి శ్రీ‌లంక ఎయిర్ లైన్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుఖ్ చేసుకున్నారు. అయితే.. ఆయ‌న బుక్ చేసిన క్యాబ్ లు మూడు బుక్ కావ‌టం.. ఓలా డ్రైవ‌ర్లు నిర్ల‌క్ష్యంతో స‌మాధానం చెప్పి.. ట్రిప్ క్యాన్సిల్ చేయ‌టం జ‌రిగాయి.

దీంతో విసుగు చెందిన స‌ద‌రు ప్ర‌యాణికులు ఎయిర్ పోర్ట్ ప్రాంగ‌ణంలోని సీ పార్కింగ్ వ‌ద్ద‌నున్న ఓలా జోన్ ప్రాంతానికి వెళ్లారు. అక్క‌డి ఓలా సిబ్బందితో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని చెప్పాడు. అయితే.. అత‌నికి స‌హ‌క‌రించ‌ని ఓలా సిబ్బంది.. తాము ఏమీ చేయ‌మ‌లేమ‌ని ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలంటూ హేళ‌న‌గా మాట్లాడారు. దీంతో తీవ్ర వేద‌న‌కు గురైన స‌ద‌రు ప్ర‌యాణికులు.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కాసేప‌ట్లో పోలీసులు ఎంట్రీ అవుతార‌న‌గా ఓలా జోన్ ఇన్ ఛార్జ్ జ‌హీర్ వ‌చ్చి బాధిత ప్ర‌యాణికుడ్ని స‌ముదాయించాడు. త‌మ డ్రైవ‌ర్లు త‌ప్పు చేశార‌ని.. వారి త‌ర‌ఫున క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లుగా చెప్పారు. ఓలా డ్రైవ‌ర్లు ఇచ్చిన షాకుతో ప్ర‌యాణికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు