ప‌వ‌న్ ను బ‌న్నీ సైతం ఫాలో అయిపోతున్నాడుగా

ప‌వ‌న్ ను బ‌న్నీ సైతం ఫాలో అయిపోతున్నాడుగా

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడే అయినా.. ఆ నీడ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి త‌న‌దైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ మాట‌కు వ‌స్తే.. మెగా ఫ్యామిలీలో ఎవ‌రికి లేనంత భారీ క్రేజ్ ప‌వ‌న్ సొంతం. ఆయ‌న్ను అంద‌రూ ఆరాధించినా.. అదే క్యాంప్‌కు చెందిన బ‌న్నీ తీరు కాస్త భిన్నంగా ఉండేది.

దీంతో.. ఇద్ద‌రి వ్య‌వ‌హారం రెండు వ‌ర్గాలుగా మారిపోయిన వైనం తెలిసిందే. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ ఎపిసోడ్ త‌ర్వాత ప‌వ‌న్ ఫ్యాన్స్ బ‌న్నీని ఎంత‌లా వెంటాడారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయితే.. శ్రీ‌రెడ్డి ఎపిసోడ్ త‌ర్వాత ఇరువురి మ‌ధ్య దూరం త‌గ్గిపోవ‌ట‌మే కాదు.. ప‌వ‌న్‌కు బ‌న్నీ స‌పోర్ట్ గా నిల‌వ‌టం మొద‌లైంది.

ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ త‌గ్గింద‌న‌టానికి నిద‌ర్శ‌నంగా బన్నీ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య మూవీ స‌క్సెస్ మీట్‌కు ప‌వ‌న్ హాజ‌ర‌య్యాడు. దీంతో.. రెండు వ‌ర్గాలుగా ఉన్న ప‌వ‌న్‌.. బ‌న్నీ ఫ్యాన్స్ ఏక‌మైన‌ట్లే. ఇదిలా ఉంటే.. సినిమాల‌కు దూరంగా.. రాజకీయంగా త‌న‌దైన శైలిలో వెళుతున్న ప‌వ‌న్ మీద అప్పుడ‌ప్పుడు సోష‌ల్  మీడియాలో పోస్టులు పెడుతున్నారు మెగా హీరోలు.

ఇప్పుడా లిస్టులో చేరారు అల్లు అర్జున్‌.  రాజ‌కీయంగా ప‌వ‌న్ ను ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ల‌క్ష్యంగా చేసుకొని చేస్తున్న కామెంట్ల‌పై త‌న రియాక్ష‌న్ అన్న రీతిలో.. ప‌వ‌న్ ఫోటో మీద ఒక మెసేజ్ తో బ‌న్నీ పోస్ట్ చేశారు. నుదుటిన ఎర్ర‌టి కండువా కట్టుకొని ఆవేశంగా మాట్లాడుతున్న‌ట్లుగా ఉన్న ప‌వ‌న్ ఫోటోకు.. నువ్వు నీ లోకంలో ఉంటే.. ప్ర‌పంచమే స‌ర్దుకుపోతుంద‌న్న అర్థం వ‌చ్చేలా బ‌న్నీ పోస్ట్ పెట్టాడు.

మెగా హీరోలు ప‌లువురు ఉన్నా.. ఎవ‌రి సాయం తీసుకోకుండా.. ప‌వ‌న్ పిలిస్తే దేనికైనా రెఢీ అంటున్నా.. ఎవ‌రిని పిల‌వ‌కుండా త‌న దారిన తాను వెళుతున్న ప‌వ‌న్ వెనుక తామున్నామ‌న్న విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో చేస్తున్న పోస్టుల‌తో చెప్పేస్తున్నారు మెగా హీరోలు. బ‌న్నీ తాజా పోస్ట్ మెగా ఫ్యాన్స్ కు మ‌రింత ఆనందాన్ని క‌లిగిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు