బాహుబలి నిర్మాత ఫైర్ అయిపోయారు

బాహుబలి నిర్మాత ఫైర్ అయిపోయారు

న్యూస్ అందించడం వేరు.. సెన్సేషన్ చేయడం వేరు.. అయితే.. న్యూస్ ను సృష్టించి మరీ సెన్సేషన్ చేసుకునేందుకు ప్రయత్నించడం ఈ మధ్య బాగానే ఎక్కువవుతోంది. ఇంటర్నెట్ విప్లపంతో పాటు సోషల్ మీడియా కూడా బాగా విస్తరించింది. ఇప్పుడు రకరకాల వార్తలు అందించే వెబ్ సైట్లు చాలానే ఉంటున్నాయి.

ఛానల్స్ లో మాత్రమే కాకుండా.. వీటిలో విపరీత ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఓ పోర్టల్ లో బాహుబలికి సంబంధించిన వార్త ఒకటి ప్రకటించారు. రామోజీ ఫిలిం సిటీని సుదీర్ఘంగా వాడుకున్నందుకు గాను.. 90 కోట్లు కట్టాలంటూ రామోజీ రావు నుంచి బాహుబలి మేకర్స్ కు నోటీసులు అందాయని వీటి సారాంశం. దీంతో తెగ హర్ట్ అయిపోయిన రాజమౌళి.. ఇకపై రామోజీతో కటీఫ్ అయిపోయారని కూడా రాసేసేయడం.. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఒళ్లు మండేలా చేసింది.

అందుకే ఈ కథనంపై రిప్లై కూడా ఇచ్చారు. సహజంగా జనరలైజ్ చేసి విమర్శలు చేసేటప్పుడు వారిని ట్యాగ్ చేయరు. కానీ ఈ కథనంపై మాత్రం శోభు బాగానే హర్ట్ అయ్యారట. అందుకే ట్విట్టర్ ద్వారా స్పందించిన శోభు.. 'కథనాలు సృష్టించేందుకు మరీ ఇంతగా దిగజారకండి. ఇలా చేస్తే సుదీర్ఘకాలం కొనసాగడం అసాధ్యం. చివరకు గాసిప్ వెబ్ సైట్ అనిపించుకోవాల్సి వస్తుంది. ఎల్లో జర్నలిజం' అంటూ రిప్లై ఇచ్చారు శోభు యార్లగడ్డ. ఇలా శోభు ఓపెన్ గా విమర్శలు చేయడం ఆశ్చర్యకరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు