ఆ పార్టీలో క్యాస్టింగ్ కౌచ్ ... ఫుల్ !

ఆ పార్టీలో క్యాస్టింగ్ కౌచ్ ... ఫుల్ !

రాజ‌కీయాల్లో ఎద‌గాలంటే...విష‌య ప‌రిజ్ఞానం, వాగ్ధాటి, ఇటీవ‌లి కాలంలో మారిన ప‌రిస్థితుల్లో అయితే డ‌బ్బు ఉండాల్సిందే. అయితే ఇలాంటి వాటికంటే శ‌రీరం అర్పించుకుంటేనే ఓ ఓ ప్ర‌తిప‌క్ష పార్టీలో అవ‌కాశాలు వ‌స్తాయ‌ట‌. ఈ విష‌యం వెల్ల‌డించింది ఎవ‌రో కాదు..ఆ పార్టీ ర‌థ‌సార‌థి క‌ట్టుకున్న భార్యే. ఔనా! అని ఆశ్చ‌ర్య‌పోకండి. అలాంటి షాకింగ్ రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారిన పార్టీ అదృష్ట‌వ‌శాత్తు మ‌న‌దేశంలో లేదు!! పొరుగు దేశ‌మైన పాకిస్తాన్‌లో ఉంది!!!. పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాసిన ఓ పుస్తకంలో రెహామ్ ఆ ఆరోపణలను విశ్లేషించారు. జూలైలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ బుక్ ఇప్పుడు పాకిస్థాన్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. రేహ‌మ్ ఇమ్రాన్‌ఖాన్ రెండో భార్య‌.

పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని తీవ్రవాదులకు అప్పగిస్తారని, ఆయన పార్టీలో లైంగిక వేధింపులూ ఉంటాయని రెహామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ ఓటర్లు ఎన్నికలకు ముందు తన పుస్తకాన్ని చదవాలని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఓ యూ టర్న్ వ్యక్తి అని, భారత్ ఆ వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. జర్నలిస్టు అయిన రెహామ్ .. కేవలం 10 నెలలు మాత్రమే ఇమ్రాన్‌తో కలిసి ఉన్నారు. అయితే ఆ కాలంలో ఆమె వ్యక్తిగతంగా ఇమ్రాన్ గురించి అనుభవించిన అంశాలను తన పుస్తకంలో రాశారు. సెక్సువల్ ఫేవర్స్ చేస్తే తెహ్రీక్ పార్టీలో కలిగే లాభాల గురించి కూడా ఆమె తన పుస్తకంలో వివరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్రాన్ గెలిస్తే, అతను దేశాన్ని తీవ్రవాదులకు అప్పగిస్తాడని రెహామ్ ఆరోపించారు.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిల్లు చేసుకోగా..మూడు పెటాకులు అయ్యాయి. 1995లో తొలిసారి జెమీమాను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. 9 ఏళ్ల తర్వాత విడాకులిచ్చాడు. 2015లో టీవీ యాంకర్ రేహమ్‌ఖాన్‌ను పెళ్లి చేసుకున్నా పది నెలల తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆయ‌న మూడో వివాహం చేసుకున్నాడు. బుష్రా మనేకా అనే మ‌హిళ‌ను ఆయ‌న వివాహం చేసుకోగా లేటు వ‌య‌సులో చేసుకున్న మూడో పెళ్లి పెటాకులైంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు