హాలీవుడ్ కి లేని వయసు మనోళ్లకేనా?

హాలీవుడ్ కి లేని వయసు మనోళ్లకేనా?

ఏదైనా ఓ పని చేయాలంటే.. దానికి వయసుతో సంబంధం లేదు.. చేయాలనే తపన ఉత్సాహమే అన్నిటి కంటే ముఖ్యం నీతులు వింటూనే ఉంటాం. ఒక్కోసారి ఇది నిజమే అనిపిస్తుంది. కొన్నిసార్లు తప్పు అనిపిస్తుంది. అదంతా ఆయా సిట్యుయేషన్స్ ప్రకారం ఎవరికి కావలసినట్లుగా వారు తీసుకుంటారు.

ఇప్పుడు టాలీవుడ్ లో దర్శకులకు వయసు పైబడడం.. ఓ సమస్య అయిపోతోంది. ఎంతటి గొప్ప డైరెక్టర్ అయినా సరే.. కొన్నేళ్లు మాత్రమే నిలకడగా సత్తా చాటగలుగుతున్నాడు. వాళ్ల ఏజ్ ఓ 50 దాటిందంటే.. ఇక వారి సినిమాలు చూడడం జనాలకు కష్టమైపోతోంది. ఒకానొక సమయంలో క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్నవారు కూడా ఆ తర్వాత రాడ్డు సినిమాలతో భయపెట్టేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన రాంగోపాల్ వర్మ మూవీ చూసిన తర్వాత.. జనాలలో ఇలాంటి అభిప్రాయం ఇంకా బలపడిపోయింది. అదేంటో.. టాలీవుడ్ లోనే ఇలా వయసు అన్నది ప్రధానమైన సమస్యగా మారుతూ ఉంటుంది.

వూడీ అలెన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ ఏజ్ ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఇంకా ఈయన రెట్టించిన ఉత్సాహంతో న్యూఏజ్ సినిమాలు కూడా తీసేస్తున్నాడు. అలాగే రోజర్ అలెగ్జాండర్ డీకిన్స్ అనే సినిమాటోగ్రాఫర్ వయుస ప్రస్తుతంత 69 ఏళ్లు. గతేడాది ఈయన ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ మధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ తరం కెమేరాలు అంతగా వెయిట్ ఉండడంలేదు కాబట్టి.. తాను మరో 10 ఏళ్లు యాక్షన్ ఫోటోగ్రఫీ అందించగలనని చెప్పాడు. అంటే కెమేరా మోసుకుంటూ పరిగెడతాడన్న మాట. మరి వీరెవరికీ లేని వయసు ఇబ్బంది మనోళ్లకు ఎందుకొస్తోందంటే అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమేమే కాదు. తాము తీసిందే సినిమా అనుకోకుండా.. సినిమాకు కాలానికి అనుగుణంగా మారగలిగితే.. ఇలాంటివి రావన్నది జనాల ఒపీనియన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English