సీఎంకు టైం ఇవ్వ‌ని మోడీ.. గ‌వ‌ర్న‌ర్ తో గంట మాట్లాడారు

సీఎంకు టైం ఇవ్వ‌ని మోడీ.. గ‌వ‌ర్న‌ర్ తో గంట మాట్లాడారు

కేంద్రంలో ఉండే అధికారానికి త‌గ్గ‌ట్లుగా ఆయా రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు మారిపోతుంటారు. దీనికి పూర్తి భిన్నం రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్.  సోనియ‌మ్మ చ‌ల్ల‌ని చూపుల‌తో ఉమ్మ‌డి రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా వ‌చ్చిన ఆయ‌న‌.. త‌న చేతుల మీదుగా విభ‌జ‌న‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌ట‌మే కాదు.. ప్ర‌ధానిగా మోడీ వ‌చ్చాక కూడా ఆయ‌న కంటిన్యూ అవుతున్నారు.

కేంద్రంలోని అధికార‌పార్టీతో సంబంధం లేద‌న్న‌ట్లుగా.. ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి విధేయుడిగా ఉండ‌ట‌మే కాదు.. వారికి కావాల్సిన వ్య‌క్తిన‌న్న భావ‌న క‌లుగ‌జేయ‌టంలో న‌ర‌సింహ‌న్ టాలెంట్ మామూలుగా ఉండ‌ద‌ని చెబుతారు. ప‌లువురు ముఖ్య‌మంత్రులు పీఎం మోడీతో భేటీకి వెళితే.. మ‌హా అయితే పావు గంట‌.. లేదంటే ముప్పావు గంట భేటీ అయితే అదే గొప్ప‌.
కానీ.. తాజాగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో జ‌రిగిన భేటీలో ఏకంగా గంట పాటు గ‌వ‌ర్న‌ర్ తో ప్ర‌ధాని మోడీ మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.  ఈ మ‌ధ్య‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప్ర‌ధానితో భేటీ అని చెప్పి వెళ్లిన త‌ర్వాత కూడా ఆయ‌న‌కు అపాయింట్ మెంట్ దొర‌క‌లేదు. ఎందుకంటే.. మోడీగారు ఫుల్ బిజీ అని చెప్ప‌టంతో ప్ర‌ధానిని క‌ల‌వ‌కుండానే హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చేశారు తెలంగాణ సీఎం.

అందుకు భిన్నంగా గ‌వ‌ర్న‌ర్ మాత్రం మోడీతో గంట పాటు భేటీ అయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై మోడీ ఆరా తీసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న రైతుబంధు.. రైతుల‌కు భీమా ప‌థ‌కంతో పాటు ఏపీ స‌ర్కారు అమ‌లు చేయాల‌నుకుంటున్న నిరుద్యోగ భృతి ప్ర‌భావం ప్ర‌జ‌ల్లో ఎంత ఉంద‌న్న ఆరాను మోడీ తీసిన‌ట్లుగా చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి అడ‌గ్గా.. ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. మోడీ.. గ‌వ‌ర్న‌ర్ ఇద్ద‌రూ భేటీ అయిన సమావేశ వివ‌రాలు బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేనా.. మీటింగ్‌కు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వివ‌రాల్ని చూస్తే.. అన్నీ పాజిటివ్‌లే త‌ప్పించి నెగిటివ్‌లు ఏమీ బ‌య‌ట‌కు పొక్క‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇద్ద‌రు ప్ర‌ముఖుల భేటీకి సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వివ‌రాల్ని ప‌రిశీలిస్తే.. తామేం అనుకున్నామో అదే జ‌నంలోకి తీసుకెళ్లే ట్రిక్ ను గ‌వ‌ర్న‌ర్ దొర‌వారు ప్ర‌ద‌ర్శించ‌టం క‌నిపిస్తుంది. తాజా మీటింగ్ తో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఒక్క విష‌యాన్ని మాత్రం స్ప‌ష్టం చేశార‌ని చెప్పారు. ఎవ‌రికి దొరికినా దొర‌కున్నా.. త‌న‌కు మాత్రం మోడీ అపాయింట్ మెంట్  దొర‌క‌ట‌మే కాదు.. ఎక్కువసేపు ఆయ‌న‌తో మాట్లాడే చ‌నువు త‌న‌కుంద‌న్న విష‌యాన్ని న‌ర‌సింహ‌న్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు