30 మంది వేశ్యలతో టీమ్‌కు ఫేర్‌వెల్.. రచ్చ రచ్చ!

30 మంది వేశ్యలతో టీమ్‌కు ఫేర్‌వెల్.. రచ్చ రచ్చ!

ఔను నిజంగానే. మ్యాచ్ గెలిచినందుకు వేశ్యల‌తో ఎంజాయ్ చేయించారు. వరల్డ్‌కప్ ఆడటం కోసం వెళ్తున్న టీమ్‌లకు వీరతిలకం దిద్ది పంపడం మనకు అలవాటు. కానీ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో ఆడటం కోసం వెళ్తున్న మెక్సికో టీమ్‌కు మంది 30 మంది వేశ్యలను తీసుకొచ్చి సాగనంపారు. చివరి వామప్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 1-0తో గెలిచిన తర్వాత రష్యాకు బయలుదేరే ముందు టీమంతా వేశ్యలతో కలిసి ఎంజాయ్ చేసింది. టీవీనొటాస్ అనే మ్యాగజైన్ ఈ ఫొటోలను పబ్లిష్ చేసింది.

ఈ మధ్య కాలంలో మెక్సికో టీమ్‌పై ఇలాంటి ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. గతంలోనూ ఓ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమ్ సభ్యులంతా కలిసి వేశ్యలతో గడిపారు. ఆ సమయంలో ఇద్దరు ప్లేయర్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. తాజాగా వేశ్యల‌తో వాళ్లు జ‌ల్సాలు చేసిన టీం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది. మెక్సికో టీమ్ ప్రస్తుతం కోపెన్‌హాగన్‌లో ఉంది. అక్కడ డెన్మార్క్‌తో ఓ ఫ్రెండ్లీ గేమ్ ఆడిన తర్వాత రష్యా బయలుదేరుతుంది. అయితే ప్లేయర్స్ ఫ్రీ టైమ్‌లో ఈ ఫంక్షన్‌కు వెళ్లారని, వాళ్లపై చర్యలు తీసుకోవడం కుదరదని మెక్సికో ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారులు చెప్పారు. వాళ్లు శిక్షణకు మిస్ కాలేదు.. ఫ్రీ డే దొరికినపుడు అది వాళ్ల ఇష్టం అని అసోసియేషన్ కార్యదర్శి గిలెర్మో కాంటు అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు