జగన్ , లోకేష్ కు శ్రీ‌రెడ్డి అండ

జగన్ , లోకేష్ కు  శ్రీ‌రెడ్డి అండ

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై అర్ధ‌నగ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో క‌ల‌క‌లం రేపిన శ్రీ‌రెడ్డి ఏ మాత్రం అవ‌కాశం దొరికినా మీడియా నోట్లో నానేందుకు వెన‌కాడ‌డం లేదు. ఆ మ‌ధ్య ప‌రిశ్ర‌మలో పెద్ద హీరోల నుండి వారి పిల్ల‌లు, ప‌లువురు సినీ ప్ర‌ముఖుల గురించి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి క‌ల‌క‌లం రేపిన శ్రీ‌రెడ్డి తాజాగా ఆంధ్రా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ కళ్యాణ్ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా, నారా లోకేష్ మీద చేస్తున్న ఆరోప‌ణ‌లపై స్పందించింది. ఆ మ‌ధ్య జ‌గ‌న్ కు అనుకూలంగా మాట్లాడిన శ్రీ‌రెడ్డి ఇప్పుడు లోకేష్ ను స‌మ‌ర్ధించ‌డం గ‌మ‌నార్హం.

నారా లోకేష్ ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించ‌డాన్ని త‌ప్పుప‌డుతూ శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "నారా లోకేష్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవారు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అని చెప్పుకోండి. అంతే గానీ విమర్శలు చేస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు" అంటూ ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను హెచ్చరించింది. అదే స‌మ‌యంలో శ్రీ‌రెడ్డి మ‌రో పోస్టులో జ‌గ‌న్ ను, ఆయ‌న కుటుంబాన్ని ప్ర‌శంసించ‌డం విశేషం.  జగన్ అన్నలా ఓర్పు మీకెక్కడ ఉంది..  జగన్ అన్న ఫ్యామిలీ లక్షల మందికి చేసిన సహాయాలు ఎవరూ మర్చిపోలేదు. సినిమా డైలాగు కొట్టి, వాటర్ తాగినంత ఈజీ కాదు. మీ అన్నయ్య రాజకీయాలు, మీ అన్న సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలీదు. మా అసోసియేషన్ లో కార్డు నాకు ఇవ్వనివ్వట్లేదు. ఇది మీ చలవే కదా అని పేర్కొంది.

ఇక మ‌రో పోస్టులో నేరుగా చిరంజీవి మీద విమ‌ర్శ‌లు చేసింది. మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తరువాత ఐదేళ్ల‌లో కేల‌వం ఒకేసారి తిరుప‌తికి వెళ్లారు. తిరుప‌తి ప్ర‌జ‌ల కోసం ఒక్క పైసా ఖ‌ర్చు పెట్ట‌లేదు. తిరుప‌తి అభివృద్ది గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేదు.  చంద్రబాబు తిరుపతికి తీసుకొచ్చి ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. పాలనపై అవగాహన లేనివారిని ఎన్నుకొని తప్పు పని చేయొద్దని మనవి అంటూ ఇంకో పోస్టు పెట్టింది. సినిమారంగంలో కాస్టింగ్ కౌచ్ గురించి గ‌ట్టిగా మాట్లాడిన శ్రీ‌రెడ్డి ఇప్పుడు ఏ ప‌నీ లేక ఇలా త‌న‌కు సంబంధం లేనివి ముందుకు వేసుకుని మీడియాలో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని అనుకుంటున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు