ఏపీపై మ‌రో పిడుగేసిన కేంద్రం!

ఏపీపై మ‌రో పిడుగేసిన కేంద్రం!

ఏపీ మీద మ‌రో పిడుగు వేసింది మోడీ స‌ర్కారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 850 ఎంబీబీఎస్ సీట్ల‌కు అనుమ‌తిని నిరాక‌రిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల్ని వెలువ‌రించింది. ఓవైపు నీట్ ఫ‌లితాలు వెలువ‌డిన వేళ‌.. త‌మ‌కొచ్చే సీట్ల గురించి లెక్క‌లు వేసుకుంటున్న వేళ‌.. ఏపీ విద్యార్థుల‌కు షాకిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది.

దీంతో.. ప‌లువురు విద్యార్థులు సీట్లు కోల్పోయే అవ‌కాశం ఉంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థుల‌కు సైతం అవ‌కాశాలు కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. విశాఖ‌ప‌ట్నం గీతం మెడిక‌ల్ క‌ళాశాల తో స‌హా మ‌రో ఆరు ప్రైవేటు కాలేజీల‌కు సంబంధించిన సీట్ల‌లో కోత ప‌డింది.

సీట్ల‌కు కోత వేసిన కాలేజీల్లో విశాఖ‌ప‌ట్నం గీతం మెడిక‌ల్ కాలేజీ కూడా ఉంది. ఈ సంస్థ డీమ్డ్ కావ‌టంతో క‌న్వీన‌ర్ కోటా సీట్లు ఉండ‌వు. ఇక‌.. మిగిలిన ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లు క‌న్వీన‌ర్ కోటా కింద‌కు సీట్లు వ‌స్తాయి. కేంద్రం ప్ర‌క‌టించిన నిర్ణ‌యంతో దాదాపు 350పైగా క‌న్వీన‌ర్ కోటా సీట్లు పోనున్నాయి. త‌మ‌కొచ్చే ర్యాంకుల‌తో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో సీట్లు రాకున్నా.. ప్రైవేటు కాలేజీల్లో క‌న్వీన‌ర్ కోటా సీట్ల‌లో అయినా చేరే వీలుంద‌న్న ఆలోచ‌న‌లు చేసే వారంద‌రిపైనా కేంద్రం ఊహించ‌ని రీతిలో షాకిచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక్క విద్యా సంవ‌త్స‌రంలో ఇంత పెద్ద ఎత్తున సీట్ల‌ను కోత పెట్ట‌టంపై ఏపీ విద్యార్థులు హాహాకారాలు చేస్తున్న ప‌రిస్థితి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు