6 నెలలు జగన్‌ ఆశలు గల్లంతే

6 నెలలు జగన్‌ ఆశలు గల్లంతే

బెయిల్‌ ఇంకో ఆరు నెలల వరకూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కి దక్కకపోవచ్చు. కారణమేంటనగా సిబిఐ, ఇంకో ఆరు నెలలకుగాని ఫైనల్‌ చార్జ్‌ షీట్‌ దాఖలు చేసే అవకాశం లేదు. సిబిఐ స్వయంగా కోర్టుకే ఈ విషయం చెప్పింది. తుది చార్జ్‌ షీట్‌ దాఖలు చేసేవరకూ బెయిల్‌ కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదని ఇదే సుప్రీంకోర్టు గతంలో బెయిల్‌ కోసం జగన్‌ తమ వద్దకు వస్తే స్పష్టం చేసింది. కాని ఆ తర్వాత కూడా జగన్‌ బెయిల్‌ కోసం ప్రయత్నించారు, ఫలితం దక్కలేదు.

 ఇప్పుడూ బెయిల్‌ కోసం జగన్‌ ప్రయత్నాలైతే చేస్తున్నారు. పార్టీ పరిస్థితేమో రోజురోజుకీ ఇబ్బందికరంగా మారుతున్నది. కొండా సురేఖ లాంటివారు పార్టీకి దూరంగా ఉండడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరగడంతో జగన్‌ వస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు, జగన్‌ ఆశలూ అన్నీ ఇంకో ఆర్నెళ్ళపాటు గల్లంతు అయినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అద్భుతం జరిగితేగాని జగన్‌కి బెయిల్‌ రాదేమో ఈలోగా.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English