నేను త‌ల‌చుకుంటే బాబు స‌ర్కారు కూలుస్తా - ప‌వ‌న్‌

నేను త‌ల‌చుకుంటే బాబు స‌ర్కారు కూలుస్తా - ప‌వ‌న్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ త‌న విచిత్ర‌మైన వ్యాఖ్య‌ల‌తో త‌న కార్య‌క‌ర్త‌ల‌ను ఎప్ప‌టిక‌పుడు విస్మ‌యానికి గురిచేస్తున్నారు. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న నిన్న విచిత్ర‌మైన కామెంట్లు చేశారు. ఎవ‌రెన్ని చెప్పినా... మోడీ గురించి అడిగినా వాటిని చెవికి ఎక్కించుకోని ప‌వ‌న్ చంద్ర‌బాబును తిడితే చాలు అధికారం ద‌క్కించుకోవ‌డం సులువు అన్న పాల‌సీని ఫాలో అవుతున్న‌ట్లుంది. ఇప్ప‌టికే చాలు షాకులు ఇచ్చిన ప‌వ‌న్ సీఎం కుర్చీపై క‌న్నేసిన విష‌యాన్ని త‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించాడు.

బాధ్య‌త గురించి త‌ర‌చూ మాట్లాడే నాయ‌కుడు ప్ర‌జ‌లను రెచ్చ‌గొడ‌తాను అని ప‌దేప‌దే చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని  టీడీపీ నేత‌లు చేసిన‌ విమ‌ర్శ‌ల‌కు స్పందించిన ప‌వ‌న్ నేను త‌ల‌చుకుంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని కూల్చ‌గ‌ల‌ను అన్నారు. త‌న‌ది బీజేపీ స్క్రిప్టు కాద‌ని, ప్ర‌జ‌ల స్క్రిప్టు అని చెప్పిన ప‌వ‌న్ నేను ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడ‌తాను అని  మాట్లాడిన మ‌రుస‌టి రోజే దానికి భిన్నంగా నేను రెచ్చ‌గొడితే బాబు స‌ర్కారు కూలిపోతుందంటూ వ్యాఖ్య‌లు చేశారు. ఈ క‌న్ఫ్యూజ‌న్ ను క్యారీ చేయ‌లేక జ‌న‌సైనికులు తంటాలు ప‌డుతున్నారు.

ప‌వ‌న్ బాబుపై ఇంకో విచిత్ర‌మైన వ్యాఖ్య కూడా చేశారు. చంద్ర‌బాబు అధికారం కోసం జ‌గ‌న్‌తో క‌లుస్తాడ‌ని, జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకుంటాడ‌ని వ్యాఖ్యానించడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. విమ‌ర్శ గానీ ఆరోప‌ణ గానీ జ‌నం న‌మ్మేలా ఉండాలి గాని మ‌రీ ఇంత వేగ్‌గా కామెంట్లు చేస్తే ఎలా ప‌వ‌న్‌. అస‌లు ఈ మాట‌ను వైసీపీ కార్య‌క‌ర్త న‌మ్మ‌డు, టీడీపీ కార్య‌క‌ర్త కూడా న‌మ్మ‌డు. ఇలాంటి అయోమ‌య‌పు మాట‌ల‌తో మా నేత ప‌రువు తీసుకుంటున్నాడ‌ని ఆ సామాజిక వ‌ర్గంలో కూడా ఆందోళ‌న మొద‌లైంద‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు