జ‌గ‌న్ పోటీ చేసినా పాల‌కొల్లులో డిపాజిట్ రాదు

జ‌గ‌న్ పోటీ చేసినా పాల‌కొల్లులో డిపాజిట్ రాదు

ఆదివారం వైఎస్ జ‌గ‌న్‌కు ఒక ఆస‌క్తిక‌ర‌మైన ఛాలెంజ్ ఎదురైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం నాదే, సీఎం కుర్చీ నాదే అన్నంత కాన్ఫిడెన్స్‌తో ఉన్న జ‌గ‌న్‌కు ఒక ఎమ్మెల్యే విసిరిన ఛాలెంజ్ వైర‌ల్ అయ్యింది. జ‌గ‌న్ రాష్ట్రాన్ని మింగితే ఆయ‌న అనుచ‌రులు గుళ్లు గోపురాల‌ను మింగారు. అలాంటి బ్యాచ్ చూసి చూసి ఎవ‌రూ అధికారం క‌ట్ట‌బెట్ట‌రు అని పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్యానించారు. జ‌నంలో మా ముఖ్య‌మంత్రికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంది. రాష్ట్రాన్నే గెలుస్తా అని జ‌గ‌న్ ప్ర‌గ‌ల్భాలే... ఆయ‌న పాల‌కొల్లులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్  కూడా రాద‌ని రామానాయుడు వ్యాఖ్యానించారు.

వైసీపీ నాయ‌కులు త‌ర‌లించిన జ‌నాన్ని చూసి తామే గెలుస్తాం అనుకుంటున్నార‌ని, అది బ‌లుపు కాదు, వాపు అన్నారు. గోదావ‌రి జిల్లాల‌కు మ‌రో  వందేళ్లు తిరుగు లేకుండా చేసే పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం చంద్ర‌బాబు పెడుతున్న శ్ర‌ద్ధ‌కు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని... చంద్ర‌బాబు మ‌ళ్లీ రాక‌పోతే ఈ ప్రాజెక్టు మ‌ళ్లీ ఎక్క‌డ ఆగిపోతుందో అని ఆందోళ‌న చెందుతున్నార‌ని ఆయ‌న అన్నారు. గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్‌కు మొన్నటి కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాద‌ని రామానాయుడు అన్నారు.

అధికారాన్ని అవినీతి వ్యాపారాల‌కు వాడుకునే జ‌గ‌న్ వంటి వ్య‌క్తికి చంద్రబాబును కానీ, తనను కానీ విమర్శించే అర్హత లేదన్నారు. జగన్ ఉండాల్సింది జనాల మధ్య కాదని, మెంటల్ ఆసుపత్రిలో అన్నారు. తాను ఏం చేస్తానో చెప్ప‌కుండా... చంద్ర‌బాబును తిడితే ఓట్లు ప‌డ‌తాయ‌నుకుంటే పాల‌కొల్లులోనే కాదు, చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్లు రావు జ‌గ‌న్ అంటూ హెచ్చ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు