ప్ర‌తి జ‌న సైనికుడికి ప‌వ‌న్ టార్గెట్ - 500 ఓట్లు

ప్ర‌తి జ‌న సైనికుడికి ప‌వ‌న్ టార్గెట్ - 500 ఓట్లు

న‌న్ను మీ క‌ళ్ల‌ల్లో పెట్టుకోండి... మిమ్మ‌ల్ని నా గుండెల్లో పెట్టుకుంటా... ఇది కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు నాయ‌కులు చెప్పేమాట‌. సాధార‌ణంగా  దానిని అభిమానులు పాటిస్తారు. నాయ‌కులు తప్పుతూ ఉంటారు కొన్నిసార్లు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇపుడు పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడే. ఇక తాను నటుడు కాదు, సినిమాల‌కు దూరం అని ఆయ‌న చెప్పేశారు. మ‌రి ప‌వ‌న్ అభిమానుల‌కు ఏం పిలుపు ఇస్తున్నారు... అంటే అది ఒక రాజ‌కీయ సంచ‌ల‌నంలా ఉంది. ఇంత‌వ‌ర‌కు ఇలా ఓట్ల‌డిగిన నేత లేరు.

ప‌వన్ పోరాట యాత్ర ఉత్త‌రాంధ్ర‌లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న త‌న‌కు సీఎం కుర్చీపై ఉన్న కోరిక‌ను ప‌లుమార్లు వెళ్ల‌బుచ్చారు. కానీ, అది ఎంత బ‌లంగా ఉందో ప‌వ‌న్ చేసిన తాజా వ్యాఖ్య‌ల్లో స్ప‌ష్ట‌మైంది. *తాను సీఎం కావాలంటే... ఒక్కో కార్య‌క‌ర్త 500 ఓట్లు వేయించాల‌ని* ప‌వ‌న్ కోరారు. మ‌రీ కార్య‌క‌ర్త‌ల‌ను మార్కెటింగ్ ఏజెంట్ల‌లా భావించి ఇలా టార్గెట్లు పెట్ట‌డంతో పాపం జ‌న సైనికులు ఖంగుతిన్నారు. అభిమానుల‌కు అలాంటి పిలుపు ఇస్తే ఓకే అనుకోవ‌చ్చు గాని.... రాజ‌కీయ నాయ‌కుడిగా కార్య‌క‌ర్త‌ల‌ను అలా కోర‌డం ఏంటి. క‌నీసం పార్టీని బ‌లోపేతం చేసి అధికారంలోకి తీసుకు రండి అని చెప్పినా బాగుంటుంది గాని... అస‌లు పార్టీని ప‌వ‌న్ ప‌క్క‌న పెట్టి నిరంత‌రం సీఎం కుర్చీ జ‌పం చేస్తుండ‌టం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.  

ఈ యాత్ర మొత్తం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు మిన‌హా తాను అధికారంలోకి వ‌స్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోతున్నాడు అనే విష‌యాన్ని మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్కసారి కూడా వివ‌రించలేదు. ప్ర‌జ‌ల‌ను క‌ల‌లను గుర్తించి వారి కోరిక‌ల‌ను పార్టీ హామీలుగా ఇస్తే ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకోవ‌చ్చు గాని వారి మ‌న‌సుల‌ను పట్టించుకోకుండా కేవ‌లం అధికార పార్టీని తిడుతూ, త‌న ఆశ‌లు మాత్రం చెబుతూ పోతే ఎలా ప‌వ‌న్ ?

ఈ యాత్ర‌లో ప‌వ‌న్ ఇంకో సంచ‌ల‌న వ్యాఖ్య కూడా చేశాడండోయ్‌... కేంద్రం ఇచ్చే అవార్డుల‌ను అంగీక‌రించొద్ద‌ని పిలుపునిచ్చారు. పందులు, కుక్క‌లు తిరిగే విజ‌య‌న‌గ‌రానికి అవార్డు ఇవ్వ‌డం ఏంట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌డంపై ఆ న‌గ‌ర వాసులు అవాక్క‌య్యార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు