మోడీ స‌ర్కారు ప‌త‌నం: 282 నుంచి 272

మోడీ స‌ర్కారు ప‌త‌నం: 282 నుంచి 272

స్వ‌యంకృతాప‌రాధం అన్న మాట‌కు స‌రైన అర్థం చెప్పాల‌నుకుంటున్నారు. పెద్ద‌గా శ్ర‌మ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌ధాని మోడీని చూపిస్తే స‌రిపోతుంది. ద‌శాబ్దాల త‌ర్వాత‌.. దేశ ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కంగా ఒక పార్టీకి క్లియ‌ర్ క‌ట్ మెజార్టీని క‌ట్ట‌బెట్టిన గొప్ప‌త‌నం మోడీ ఖాతాలో వేశారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ.. ద‌రిద్ర‌పుగొట్టు అధికారం ఊరికే ఉండ‌నీయదు క‌దా. కుర్చీ చేతికి వ‌చ్చే వ‌ర‌కూ ఉన్న ఆరాటం.. వ‌చ్చాక అదో అహంకారంగా మారిపోయి అంద‌రిని చిన్న‌చూపు చూడ‌టం.. అంతా త‌మ మాటే వినాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. స‌మ‌స్య‌ల్ని ప్ర‌జ‌ల దృష్టితో నుంచి కాక త‌మ దృష్టితో చూసే నేత‌లు ఎవ‌రూ ప్ర‌జాద‌ర‌ణ పొందిన నేత‌లు కాలేదు. ఇప్పుడు మోడీ ప‌రిస్థితి కూడా అంతే.

 టీ అమ్మే కుర్రాడు దేశ ప్ర‌ధాని కుర్చీలో కూర్చోనున్నాడ‌న్న వెంట‌నే.. సామాన్యుడి ఈతి బాధ‌లు తెలుసు కాబ‌ట్టి.. మిగిలిన వారికంటే భిన్న‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని అంతా భావించారు. కానీ.. అదంతా త‌ప్పేన‌న్న విష‌యాన్ని మోడీ త‌న పాల‌న‌తో తేల్చేశారు. 2014 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ సొంతంగా 282 సీట్ల‌ను గెలుచుకొని.. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని సొంతం చేసుకుంది.

గ‌డిచిన నాలుగేళ్లుగా మోడీ అనుస‌రిస్తున్న విధానాల‌తో ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిన అసంతృప్తి.. అప్పుడ‌ప్పుడు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మోడీపై త‌మ‌కున్న అసంతృప్తిని.. ఆగ్ర‌హాన్ని ఓట్ల‌తో ఓట‌ర్లు చెప్పేశారు. ఇదే.. తాజాగా మోడీ స‌ర్కారుకు మెజార్టీ స్థానాల్ని కోల్పోయేలా చేసింది.

నాలుగేళ్ల క్రితం తిరుగులేని అధిక్య‌త‌ను సొంతం చేసుకున్న మోడీ.. నాలుగేళ్లు గ‌డిచే స‌రికి 272 స్థానాల‌కు ప‌డిపోయి.. మోడీ డౌన్ ఫాలో ఎలా ఉందో క‌ళ్ల‌కు క‌ట్టేలా చేస్తోంది. 2014లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన స్థానాల‌కు అద‌నంగా ప‌ది స్థానాలు ఉంటే.. ఇప్పుడు బొటాబొటి బ‌లంగా మోడీ స‌ర్కారు బండి లాగే ప‌రిస్థితినెల‌కొంది.
త‌న తీరుతో ఇప్ప‌టికే మిత్ర‌ప‌క్షాల్ని దూరం చేసుకున్న మోడీకి.. తాజాగా త‌గ్గిన బ‌లం ఆయ‌న డౌన్ ఫాల్ ను గుర్తు చేయ‌ట‌మే కాదు..మిత్రుల మ‌ద్ద‌తు ఇప్పుడు ఎంత అవ‌స‌ర‌మ‌న్నది బీజేపీకి త‌గ్గిన బ‌లం చెప్ప‌క‌నే చెప్పేస్తుంది.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్శాత 13 బీజేపీ సిట్టింగ్ స్థానాల‌తో స‌హా మొత్తం 27 లోక్ స‌భా స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిల్లో కేవ‌లం 5 స్థానాల్ని మాత్ర‌మే బీజేపీ గెలుచుకోవ‌టం గ‌మ‌నార్హం. మిగిలిన 8 సీట్ల‌ను కోల్పోవ‌టం.. అసెంబ్లీకి ఎంపికైన  బీజేపీ ఎంపీలు య‌డ్యూర‌ప్ప‌.. శ్రీ‌రాములు త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టంతో ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో బీజేపీ బ‌లం 272కు ప‌డిపోయింది. ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌లో 539 స్థానాల‌కు మాత్ర‌మే ఎంపీలు ఉన్నారు. ఈ లెక్క‌న సాధార‌ణ మెజార్టీ 270. ప్ర‌స్తుతం బీజేపీ ఎంపీలు 272 మంది. అంటే.. సాధార‌ణ మెజార్టీకి మించి కేవ‌లం 2 సీట్లు మాత్ర‌మే ఎక్కువ ఉన్నారు. అయితే.. ఎన్డీయే కూట‌మి కింద 300 పైసా స్థానాలు ఉన్న నేప‌థ్యంలో మోడీ స‌ర్కారుకు మునిగిపోయే ప్ర‌మాదం ఏమీ లేదు కానీ.. అధికారంలో ఉండి కూడా సిట్టింగ్ స్థానాల్ని నిల‌బెట్టుకోని దైన్యం ఇప్పుడు బీజేపీలో క‌నిపిస్తోంది. అదే.. మోడీ డౌన్ ఫాల్ కు నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు