జేసీ మాట‌లతో చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు

జేసీ మాట‌లతో చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు

 ఏపీ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. మ‌హానాడు సంద‌ర్భంగా వేదిక మీద ప్ర‌సంగించేందుకు వ‌చ్చిన సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి అనూహ్యంగా బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే. నిత్యం టెలీకాన్ఫ‌రెన్స్ లతో మోతెక్కించే బాబు పుణ్య‌మా అని అధికారుల నుంచి ఫ్యూన్ల వ‌ర‌కూ ఎవ‌రూ ప‌ని చేయ‌టం లేద‌ని.. ప్ర‌జ‌ల‌కు త‌ర్వాత నేత‌ల‌కు సైతం అందుబాటులోకి ఉండ‌టం లేదంటూ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

బాబుకు ఎవ‌రూ మంచి మాట‌లు చెప్ప‌ర‌ని.. తెగ పొగిడేస్తారు కానీ.. నిజాలు మాత్రం నోటి నుంచి రావ‌ని.. కానీ..తాను మాత్రం నిజాల్ని చెప్ప‌కుండా ఉండ‌లేనంటూ బాబు చేస్తున్న త‌ప్పుల చిట్టాను తెలివిగా బ‌య‌ట‌పెట్టారు జేసీ. బాబుపై ఆయ‌న మాట‌లు బాగానే ప‌ని చేసిన‌ట్లు ఉన్నాయి. టెలీకాన్ఫ‌రెన్స్ లు.. జ‌న్మ‌భూమి క‌మిటీల మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాతి రోజే.. బాబు స‌ర్కారు రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

దీని ప్ర‌కారం ఇక‌పై వారానికి ఒక్క రోజు మాత్ర‌మే టెలీ కాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. అంతేకాదు.. ఫించ‌న్ల ఎంపిక కోసం ఉద్దేశించిన జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఎత్తి వేస్తూ.. ఆన్ లైన్లో ఎవ‌రు అప్లై చేసినా.. జ‌న్మ‌భూమి క‌మిటీలతో సంబంధం లేకుండా ఎంపిక చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

జేసే ఏ అంశాల్ని ట‌చ్ చేసి.. త‌న అసంతృప్తిని బాహాటంగా చెప్పారో.. ఆ అంశాల మీద 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే బాబు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకైనా మంచిది.. బాబు పాల్గొనే ప్ర‌తి బ‌హిరంగ స‌భ‌లోనూ జేసీ చేత మాట్లాడిస్తే మంచిదేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు