రాజ‌కీయాలు క‌ష్టం... ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయ‌ను

రాజ‌కీయాలు క‌ష్టం... ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయ‌ను

బాబాయ్ పార్టీని ఉద్దేశించి న‌టుడు రాంచ‌ర‌ణ్ చేసిన రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ఇటీవ‌లే ఒక కార్య‌క్ర‌మంలో రాంచ‌ర‌ణ్‌ మాట్లాడుతూ *బాబాయి్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలిస్తే జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి వెళ్తాను* అని రాంచ‌ర‌ణ్ అన్నారు. అది శ‌ర‌వేగంగా వైర‌ల్ అయ్యింది. అయితే, కొన్ని రోజుల క్రితమే చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌పై ఈరోజు వ‌ర‌కు స్పందించ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సాయంత్రం స్పందించారు.

త‌న పార్టీలోకి రావ‌డానికి స్వ‌త‌హాగా ఎవ‌రు వ‌చ్చినా ఆహ్వానిస్తాను. ఎవ‌రినీ నేను పిల‌వ‌ను. నా కుటుంబ స‌భ్యులు కూడా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తాను. నేన‌యితే తన కుటుంబ సభ్యులను రమ్మని అడగబోను* అని ప‌వ‌న్ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. కుటుంబ స‌భ్యులు వారి వారి ప‌నుల్లో బిజీగా, హ్యాపీగా ఉన్నారు. అందుకే  ఒక వేళ వారు వ‌స్తాను అన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని రమ్మని చెబుతాన‌ని  పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత అవ‌స‌రం, ఇది ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఉండే వ్య‌వ‌స్థ‌, ఇష్టపడి రావాలని అన్నారు.  ఇంత‌కుమించి దీనిపై మాట్లాడదలుచుకోలేదని అన్నారు.

అయితే, మెగా ఫ్యామిలీ ఈ రిప్ల‌యిని ఊహించి ఉండ‌దు. అందుకే పిలిస్తే వ‌స్తాను అని మొన్న రాంచ‌ర‌ణ్ కామెంట్ చేసిన‌ట్టున్నాడు. స్వ‌యంగా ప్ర‌చారానికి నేరుగా వ‌చ్చి ఉంటే బాగుండేద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. నిజ‌మే క‌దా... సొంత బాబాయి పార్టీ పెడితే క‌లుపుకుని వెళ్ల‌కుండా పిలిస్తే వెళ‌తాను అని అన‌డం కొంచెం ఇబ్బందిక‌ర‌మైన మాటే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు