అవినీతిని నిలదీస్తే తప్పేంటట

అవినీతిని నిలదీస్తే తప్పేంటట

అవినీతి మంత్రులను తొలగించాలనే డిమాండుతో చంద్రబాబు టీమ్‌ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నది. గవర్నర్‌ని కలిశారు, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇవన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ దృష్టిలో 'కుమ్మక్కు రాజకీయాలు'. అంటే ఏమిటి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఉద్దేశం? సిబిఐ అభియోగాలు మోపిన మంత్రులు మంత్రి వర్గంలోనే కొనసాగాలని ఆ పార్టీ అనుకుంటున్నదేమో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పవలసి ఉంటుంది.

రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేశారు వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌. అది కాంగ్రెసుతో కుమ్మక్కు అయినట్టు కాదేమో. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చినా, ప్రతిపక్షాలన్నీ కలిసి వారిని నిలదీయాల్సి ఉంటుంది. కాని ఇక్కడ విచిత్రం. అవిశ్వాసానికి వ్యతిరేకంగా వైకాపా ఓటేస్తే, టిడిపి మౌనం పాటిస్తుంది. అవినీతి అభియోగాలున్న మంత్రులను టిడిపి నిలదీస్తే వైకాపా అడ్డు తగులుతున్నది. ఎవరితో ఎవరు కుమ్మక్కవుతున్నారో ప్రజలకు అర్థం కావడంలేదు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English