ఇండియాలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అట‌!

ఇండియాలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అట‌!

సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు నెల‌వైన భార‌త‌దేశంలో కొన్నేళ్లుగా పాశ్చాత్య సంస్కృతి వెర్రిత‌ల‌లు వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందుబాటులోకి వ‌చ్చిన అత్యాధునిక టెక్నాల‌జీ....స్మార్ట్ ఫోన్లు...పోర్న్ సైట్లు....సినిమాల‌లో మితిమీరిన విచ్చ‌ల‌విడిత‌నం...శృంగారం....వెస్ట‌ర్న్ క‌ల్చ‌ర్ లోనే నాగ‌రిక‌త ఉంద‌నుకునే ధోర‌ణి.....ఇలా కార‌ణాలు ఏవైనా....కొద్దిమంది యువ‌త పెడ‌దారి ప‌డుతోంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.

ముఖ్యంగా ప‌ట్టుమ‌ని ప‌దోత‌ర‌గ‌తి కూడా పూర్తికాని కొంద‌రు అమ్మాయిలు, అబ్బాయిలు...ప్రేమ పేరుతో విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌డం....శృంగారంలో పాల్గొన‌డం కామ‌న్ అయిపోయింది. గ‌తంలో పెళ్లికి ముందు శృంగారాన్ని త‌ప్పుగా భావించేవారు. కానీ, హైటెక్ జ‌మానాలో పెళ్లికి ముందు శృంగారం చేయ‌క‌పోతే త‌ప్పేమో అన్న‌ట్లుగా కొంత‌మంది యువ‌తీయువ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. తాజాగా, కొంత‌మంది భార‌తీయుల‌పై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) 2015-16లో నిర్వ‌హించిన స‌ర్వేలో అనేక షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. వివిధ వయసులున్న‌ లక్ష మంది స్త్రీపురుషులను స‌ర్వే చేయ‌గా ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. దేశంలోని అత్యధిక శాతం మంది అమ్మాయిలు 19 సంవత్సరాల లోపే త‌మ తొలి లైంగిక అనుభవాన్ని పొందుతున్నారని ఆ స‌ర్వేలో వెల్ల‌డైంది. అంతేకాకుండా, 15 నుంచి 19 ఏళ్లలోపే వారు లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని తెలిపింది.

``మేం వ‌య‌సుకు వ‌చ్చాం....ప‌రువానికి వ‌చ్చాం.....ఈ 20 ఏళ్లు అరె వ్య‌ర్థం చేశాం....``అంటూ ఓ పాపుల‌ర్ పాట‌కు త‌గ్గ‌ట్లు గానే భార‌త్ లోని టీనేజ‌ర్లు 15-19 మ‌ధ్య‌లోనే వ‌య‌సుకు వ‌చ్చేస్తున్నార‌ని ఆ స‌ర్వేలో వెల్ల‌డైంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలోని వారు లైంగిక జీవితాన్ని భేషుగ్గా  అనుభ‌విస్తున్నారని తేలింది.

 పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపే తమ తొలి అనుభవాన్ని పొందుతున్నార‌ట‌. 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వారిలో 2 శాతం పురుషులు, 10 శాతం స్త్రీలకు లైంగిక అనుభవం దగ్గరవుతోంద‌ట‌. 15 నుంచి 19 ఏళ్ల మధ్య 23 శాతం పురుషులు, 57 శాతం స్త్రీలు, 20 నుంచి 24 ఏళ్ల మధ్య 42 శాతం మంది పురుషులు, 24 శాతం మంది స్త్రీలు, 24 నుంచి 29 ఏళ్ల వారిలో 23 శాతం మంది పురుషులు, 5 శాతం మంది స్త్రీలు తొలి లైంగికానందాన్ని పొందుతున్నార‌ట‌. 30 ఏళ్ల తర్వాత‌ మాత్రమే 10 శాతం మంది పురుషులకు ఆ ఆనందం ద‌క్కుతుండ‌గా, 1 శాతం మంది ఆడవారుండ‌డం విశేషం.

అయితే, అమ్మాయిలకు యుక్త వయసులో పెళ్లి కావ‌డంతోనే వారు తొందరగా తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్ హెచ్ఎస్ తెలిపింది. పెళ్లికి ముందు సెక్స్ నిషేధించిన‌ప్పటికీ 24 ఏళ్లలోపు పురుషుల్లో 11 శాతం మంది, స్త్రీలలో 2 శాతం మంది సెక్స్ లో పాల్గొన్నట్టు తేలింది.  

రెండు తెలుగు రాష్ట్రాల విష‌యంలో ....తెలంగాణ క‌న్నా ఆంద్రా ఈ విష‌యంలో ముందుంది. తెలంగాణ‌లో 35 శాతం మంది, ఆంధ్రప్రదేశ్ లో 45 శాతం మంది తాము చాలా రోజుల నుంచి సెక్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నామ‌ని చెప్పార‌ట‌. అనుకోకుండా సెక్స్ చేశామ‌ని 20 శాతం మంది చెప్ప‌గా, వేశ్య ద‌గ్గ‌ర ఆనందం పొందామ‌ని 16 శాతం మంది చెప్పారు. తమ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ చేశామ‌ని 68 శాతం మంది పురుషులు, 64 శాతం మంది స్త్రీలు వెల్లడించార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు