మీ పెద్ద‌రికం నిలెబ‌ట్టుకోండి - రాజుగారిపై ప‌వ‌న్‌

మీ పెద్ద‌రికం నిలెబ‌ట్టుకోండి - రాజుగారిపై ప‌వ‌న్‌

అశోక గ‌జ‌ప‌తి రాజు... ఉత్త‌రాంధ్ర తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేత‌. కేంద్ర మంత్రిగా ప‌నిచేసి మంచి పేరే తెచ్చుకున్నారు. సాధార‌ణంగా వివాదాల్లోకి త‌ల‌దూర్చ‌రు. కానీ ఈ మ‌ధ్య‌నే ఆయ‌న ఆటిట్యూడ్‌కు భిన్నంగా ఒక‌ట్రెండు కామెంట్లు చేశారు. వాటిలో ఒకటి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన కామెంటు. *ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో నాకు తెలియ‌దే* అని కొంత కాలం క్రితం ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆయ‌న సెన్స్‌ను బ‌ట్టి అది వ్యంగ వ్యాఖ్య అని అర్థ‌మైంది. కానీ, అలాంటి వ్యాఖ్య‌లే గ‌తంలో టీడీపీ వాళ్లు కొంద‌రు చేస్తే వాటికి రిప్ల‌యి ఇచ్చిన ప‌వ‌న్ రాజుగారికి రిప్ల‌యి ఇవ్వ‌లేదు. తాజాగా ఉత్త‌రాంధ్ర టూరులో దానిపై పంచ్ వేశారు.

పోరాట యాత్ర‌లో రాజాం ప్రాంతానికి చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు దారి మ‌ధ్య‌లో అశోక గ‌జ‌ప‌తి రాజు - చంద్ర‌బాబు ఫొటోల‌తో ధ‌ర్మ‌పోరాట దీక్ష ఫ్లెక్సీ ఒక‌టి క‌నిపించింది. దానిని చూసిన ప‌వ‌న్ గ‌తంలో త‌న‌పై అశోక గ‌జ‌ప‌తి రాజు చేసిన కామెంట్ల‌ను ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శించారు.  *నేను 2014 అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో ప్ర‌చారానికి విజయనగరం వెళ్లాను. అశోక్ గజపతిరాజు కోసం ఆయన నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం చేశాను. ఆయనకు ఓట్లు వేయాలని ప్రజలను కోరాను. మ‌రి దానికి ఆయ‌న నాకు ఎలాంటి బ‌హుమ‌తి ఇచ్చారో మొన్న‌నే మీరు గ‌మ‌నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో నాకు తెలియ‌దు* అన్నారు. మ‌రి ఒక అనామ‌కుడితో ప్ర‌చారం చేయించుకోవాల్సిన దుస్థితిలో ఆయ‌న ఎందుకు ఉన్నారో మ‌రి అని ప‌వ‌న్ విమ‌ర్శించారు.

హోదా గురించి తాను ప్ర‌శ్నించేస‌రికి వాళ్ల‌కు మ‌తిమ‌రుపు వ‌చ్చిందా? నేను ఎవరో తెలియదని అంటున్నారని నిప్పులు చెరిగారు. అశోక గ‌జ‌ప‌తి రాజు వయసులో నా కన్నా పెద్దవారు. ఆయనపై నాకు గౌర‌వం ఉంది. త‌న‌ పెద్దరికాన్ని ఆయన కూడా నిల‌బెట్టుకోవాలి... అంటూ చుర‌క‌లు వేశారు ప‌వ‌న్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English