రాహుల్ `విదేశీ` ట్వీట్ పై త‌మిళ తంబీ `స్వ‌దేశీ` ట్వీట్...వైరల్!

రాహుల్ `విదేశీ` ట్వీట్ పై త‌మిళ తంబీ `స్వ‌దేశీ` ట్వీట్...వైరల్!

ఏ చిన్న వంక దొరికినా ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డేందుకు బీజేపీ నేత‌లు ఉవ్విళ్లూరుతుంటారు. గ‌తంలో రాహుల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా, వ్య‌క్తిగ‌త ప‌నుల నిమిత్తం విదేశాల‌కు వెళ్లిన‌పుడు ..రాహుల్  చెప్పాపెట్టకుండా విదేశాల‌కు వెళ్లారంటూ బీజేపీ నేత‌లు సెటైర్లు వేశారు. గత అనుభవాల కారణంగా రాహుల్ జాగ్ర‌త్త ప‌డ్డారు. త‌న విదేశీ ప‌ర్య‌ట‌న గురించి బీజేపీ నేత‌ల‌కు ముంద‌స్తు సమాచారాన్ని తెలియ‌జేస్తూ ట్విట్ట‌ర్ లో సెటైర్ వేశారు.

 ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అమ్మను వైద్య పరీక్షల నిమిత్తం విదేశాల‌కు తీసుకెళ్తున్నందున కొద్ది రోజులు అందుబాటులో ఉండ‌న‌ని రాహుల్ ట్వీట్ చేశారు. తనను విమర్శించేందుకు బీజేపీ ట్రోలింగ్ ఆర్మీలో ఉన్న త‌న మిత్రులు ఎక్కువగా కష్టపడవద్దని, త్వరలోనే తిరిగి వస్తానని సెటైరిక‌ల్ గా ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ ట్వీట్ కు ఓ నెటిజ‌న్ అదిరిపోయే రిటార్ట్ ఇచ్చారు. రాహుల్ చ‌మ‌త్కార ట్వీట్ కు అంతే వ్యంగ్యాత్మ‌కంగా రీట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

రాహుల్ ట్వీట్ కు త‌మిళ‌నాడుకు చెందిన  ప్ర‌ద్యాపాక ఎస్. వేణు గోపాల‌న్ అనే వ్య‌క్తి అదిరిపోయే రీట్వీట్ చేశాడు.``అమ్మగారు(సోనియా)త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను. అమ్మగారికి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, చికిత్స అందించేందుకు భార‌త్ లో ఒక మంచి ఆసుప‌త్రి లేదా? విదేశాల‌కు ఎందుకు? వ‌్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం మీ కుటుంబం ప్ర‌తిసారీ విదేశాల‌కు వెళ్ల‌డం దేనికి? మీరు స్వ‌దేశంలోని వైద్యుల‌ను, ఆసుప‌త్రుల‌ను న‌మ్మ‌న‌పుడు....మిమ్మ‌ల్ని మేము న‌మ్మాల‌ని ఎలా ఆశిస్తున్నారు? `` అని ట్వీట్ చేశారు.

దీనికి స్పందించిన మ‌రో వ్య‌క్తి... మీ స‌మ‌స్య‌ ఏమిట‌ని గోపాల‌న్ కు ట్వీట్ చేశారు. దానికి గోపాల‌న్ ఘాటుగా బ‌దులిచ్చారు.``వారి వ్య‌వ‌హార శైలే నా స‌మ‌స్య‌. భార‌త్ ను పాలించాల‌నుకునే వారు భార‌తీయులుగా ఉండేందుకు గ‌ర్వించాలి. భార‌త్ లో ఉన్న సౌక‌ర్యాల‌తో స‌ర్దుకొని....మిగ‌తా భార‌తీయుల‌కు ఆ పాల‌కులు ఆద‌ర్శంగా నిల‌వాలి. వైద్యం కోసం విదేశాల‌కు ప‌రిగెత్తేందుకు ఇది 70-80వ ద‌శ‌కం కాదు. ప్ర‌పంచ‌స్థాయి వైద్యం, సౌక‌ర్యాలు భార‌త్ లో ఉన్నాయి.``అని గోపాల‌న్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్స్ కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.  


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు