క‌ర్ణాట‌క‌లో బీజేపీకి మ‌రో అవ‌మానం !

క‌ర్ణాట‌క‌లో బీజేపీకి మ‌రో అవ‌మానం !

అడ్డ‌దారిలో అధికారం కోసం బీజేపీ క‌దిపిన పావులు దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌ను ఎదుర్కోవ‌డంతో వెనుదిర‌గ‌క త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానంతో కూడా చీవాట్లు తిని నాలుగు రోజుల్లో అ అధికారాన్ని వ‌దిలేశాయాల్సి వచ్చింది. అధికార‌మూ, ప‌రువు రెండూ పోవ‌డంతో బీజేపీలో నిరాశ, ఫ్ర్ర‌స్ట్రేష‌న్ తారా స్థాయికి చేరుకుంది. గ‌తంలో ఎన్న‌డూ ఏ పార్టీ కూడా కొత్త ఏర్పాటైన ప్ర‌భుత్వంపై రెండు మూడునెల‌ల్లోపు ఆందోళ‌న‌ల‌కు పిలుపు నిచ్చిన సంప్ర‌దాయం లేదు. దానిని కూడా బీజేపీ మీరింది. దీంతో తాజాగా బీజేపీకి క‌ర్ణాట‌క‌లో మ‌రో అవ‌మానం ఎదురైంది.

త‌మ పార్టీ జేడీఎస్ అధికారంలోకి వ‌స్తే రైతు రుణ‌మాఫీ చేస్తాన‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు కుమార స్వామి ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు. అయితే, ఆయ‌న‌కు కేవ‌లం 38 సీట్లే వ‌చ్చాయి. దీంతో పార్టీ అధికారంలోకి వ‌చ్చే మెజారిటీకి చాలా దూరంలో ఉండిపోయింది. అయితే, బీజేపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్ ఆ పార్టీకి సంపూర్ణ మ‌ద్దతు ఇచ్చి కుమార‌స్వామిని సీఎం చేసింది. సీఎం పోస్టు అయితే ద‌క్కింది గాని కుమార‌స్వామి భ‌విష్య‌త్తు మొత్తం కాంగ్రెస్ చేతుల్లో ఉండిపోయింది. ఈ నేప‌థ్యంలో కుమార‌స్వామిని మ‌రింత ఇరుకున పెట్ట‌డానికి బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

*రైతు రుణమాఫీపై జేడీఎస్ అధ్య‌క్షుడు, సీఎం కుమారస్వామి మాట నిల‌బెట్టుకోలేద‌ని* ఆరోపిస్తూ కర్ణాటక బీజేపీ నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, 53 వేల కోట్ల రుణాల మాఫీని డిమాండ్ చేస్తూ వారిచ్చిన బంద్ పిలుపునకు రాష్ట్రంలో క‌నీస స్పంద‌న కూడా ద‌క్క‌లేదు. సాధార‌ణంగా బంద్ ప్ర‌భావం మొట్ట‌మొద‌ట స్కూళ్లు, ర‌వాణాపై ఉంటుంది. కానీ అవ‌న్నీ సాఫీగా న‌డిచాయి. అస‌లు బంద్ వాతావ‌ర‌ణ‌మే ఎక్క‌డా క‌నిపించలేదు. దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి  తలకొట్టేసినట్టు అయింది. బంద్ రుణ‌మాఫీ గురించి చేసినా క‌నీసం రైతుల నుంచి కూడా స్పంద‌న లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. బీజేపీ రాజ‌కీయ దురుద్దేశమే ఈ బంద్ పిలుపున‌కు కార‌ణ‌మ‌ని అంద‌రూ భావించ‌డం  ఫీల‌వ‌డం వ‌ల్లే స్పంద‌న శూన్యంగా ఉందంటున్నారు. ఏదేమైనా ఇది తొంద‌ర‌పాటుతో చేసిన స్వ‌యంకృతాప‌రాధం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు