కేసీఆర్‌కు మ‌ళ్లీ మోడీ షాక్ త‌ప్ప‌లేదెందుకు?

కేసీఆర్‌కు మ‌ళ్లీ మోడీ షాక్ త‌ప్ప‌లేదెందుకు?

రూల్ అంటే రూల్ అన్న‌ట్లు ఉండాలి. ప్ర‌ధాని హోదాలో ఉండి ఒక ముఖ్య‌మంత్రికి టైమిచ్చి.. మ‌రో సీఎంకు టైమ్ ఇవ్వ‌క‌పోవ‌టంలో మ‌ర్మం ఏమిటి? ప‌్ర‌ధాని మోడీతో భేటీ అంటూ హ‌డావుడిగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. గోడ‌కు కొట్టిన బంతి మాదిరి.. కామ్ గా హైద‌రాబాద్ కు వ‌చ్చేయ‌టం ఏమిటి?

స‌రే.. ప్ర‌ధాని అన్నాక బోలెడ‌న్ని ప‌నులు ఉంటాయి. ఎంతోమందితో ఆయ‌న భేటీ కావాల్సి ఉంటుంద‌ని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో క‌లిసి.. ఫోటోల‌కు ఫోజులిచ్చారు. మొత్తం క‌లిపితే సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు న‌ల‌భై మంది కూడా లేని ముఖ్య‌మంత్రికి టైమిచ్చిన మోడీ.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో సునామీని సృష్టిస్తాన‌ని.. అది కూడా హైద‌రాబాద్‌లో కూర్చొని అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్ లాంటి తిరుగులేని అధినేత‌కు రెండు నిమిషాలు టైం ఇచ్చేందుకు సైతం నో అని ఎందుకు చెప్పిన‌ట్లు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌.. అంద‌రికి చెప్పిన‌ట్లు వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని ప్ర‌ధానితో మాట్లాడి.. ఆ ఫైల్ మీద సంత‌కాలు పెట్టించేందుకు ఎంత మాత్రం కాద‌ని చెబుతున్నారు. కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ముందు రోజు వెళ్లి వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆ సంద‌ర్భంగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్ని మోడీకి చెప్పేందుకే తాజా టూర్ గా చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే మోడీ అపాయింట్ మెంట్ కోసం ట్రై చేయ‌టం.. నో ప్రాబ్లం అంటూ ఢిల్లీ పెద్ద‌లు భ‌రోసా ఇవ్వ‌టంతో కేసీఆర్ దేశ రాజ‌ధానికి వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. ఇక్క‌డే.. సినిమా ఊహించ‌ని మ‌లుపు తిరిగింద‌ని చెబుతున్నారు. ఎవ‌రికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారో.. స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌టం.. కులాశాగా క‌బుర్లు చెప్ప‌టంతో .. కేసీఆర్ కు హ్యాండ్ ఇవ్వక త‌ప్ప‌లేద‌ని చెబుతున్నారు. దీనికి తోడు ఫారిన్ టూర్ పెట్టుకోవ‌టంతో.. షెడ్యూల్ లెక్క తేడా రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో కేసీఆర్ ను క‌ల‌వ‌లేదు త‌ప్పించి.. మ‌రింకేమీ కార‌ణంలేదంటున్నారు. ఏమైనా.. త‌న‌ను క‌ల‌వ‌టానికి వ‌చ్చే వారికి ఒక ప‌ట్టాన అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా  ముప్ప తిప్ప‌లు పెట్టే కేసీఆర్‌. కు.. ఇప్పుడు అలాంటి అనుభ‌వ‌మే ఆయ‌న‌కు ఎదురు కావ‌టం గ‌మ‌నార్హం. మోడీనా మ‌జాకానా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు