'టీడీపీని నంద‌మూరి వార‌సుల‌కు అప్ప‌గించాలి'

'టీడీపీని నంద‌మూరి వార‌సుల‌కు అప్ప‌గించాలి'

టీటీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు... ఎన్టీఆర్ 95వ జ‌యంతిని పుర‌స్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు.  ఈ సంద‌ర్భంగా భోరున విల‌పించిన ఆయ‌న‌.. త‌న‌పై కుట్ర‌లు జ‌రిపి త‌న‌ను టీడీపీ నుంచి దూరం చేశార‌న్నారు.

చంద్ర‌బాబు మాట మీద నిల‌బ‌డ‌టం లేద‌న్న మోత్కుప‌ల్లి.. గ‌తంలో త‌మ‌తో ఉంటాన‌ని చెప్పిన బాబు.. అధికారం చేతిలోకి వ‌చ్చినంత‌నే చెప్పిన మాట‌ల్ని మ‌ర్చిపోయార‌న్నారు. తెలంగాణ‌వాదులు దాడులు చేస్తుంటే బాబును తానే ర‌క్షించిన‌ట్లు చెప్పారు. అవ‌న్నీ బాబుకు ఇప్పుడు గుర్తు లేవ‌న్నారు.

బాబుకు నైతిక విలువ‌లు లేవ‌న్న మోత్కుప‌ల్లి.. రాజ్య‌స‌భ సీట్ల‌ను కోటీశ్వ‌రుల‌కు అమ్ముకున్నార‌న్నారు. టీడీపీని నంద‌మూరి వార‌సుల‌కు అప్ప‌గించాల‌న్న డిమాండ్ చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలో.. ప్యాకేజీ కావాలో.. నాలుగేళ్లుగా బాబు తేల్చుకోలేక‌పోయిన వైనాన్ని ప్ర‌శ్నించిన మోత్కుప‌ల్లి.. మోడీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు ఎపిసోడ్ పైనా టైమ్లీగా స్పందించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దును మొద‌ట స‌మ‌ర్థించిన చంద్ర‌బాబు ఇప్పుడు విరుచుకుప‌డుతున్నార‌న్నారు. నాడు పెద్ద‌నోట్ల‌ను స‌మ‌ర్థించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు బ్యాంకుల్లో న‌గ‌దు లేక‌పోవ‌టానికి కార‌ణం పెద్ద‌నోట్ల ర‌ద్దేన‌ని బాబు విరుచుకుప‌డ‌టం ఏమిటంటూ త‌ప్పు ప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా అవ‌కాశాలు లేన‌పుడే బాబులో త‌ప్పులు క‌నిపిస్తాయా మోత్కుప‌ల్లి అంటూ టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు