కృష్ణా-గుంటూరులో కింగ్ ఎవ‌రో తెలుసా?

కృష్ణా-గుంటూరులో కింగ్ ఎవ‌రో తెలుసా?

తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మ‌హానాడు సంద‌ర్భంగా ఆ పార్టీ నేత‌లు ఖుష్ అయ్యే క‌బురు తెర‌మీద‌కు వ‌చ్చింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో తొలిసారిగా నిర్వ‌హిస్తున్న మ‌హానాడుతో ఓ వైపు పార్టీ నేత‌లంతా సంద‌డిగా, సంతోషంగా ఉన్న స‌మ‌యంలో మ‌రోవైపు రాజ‌ధాని ప్ర‌జ‌లు టీడీపీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వంలోని ప‌నితీరుపై సంతృప్తిగా ఉన్న‌ట్లు తాజా స‌ర్వే వెల్ల‌డైంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ ద్వారా చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆస‌క్తిక‌రమైన నివేదిక వ‌చ్చింది. ఇందుకు ఆస‌క్తిక‌ర‌మైన కారణం ఇటీవ‌లి కాలంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇటు ప‌రిపాల‌న ప‌రంగా అటు రాజ‌కీయంగా తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలు.

టీడీపీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం...రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణ‌యాలు, చంద్ర‌బాబు సార‌థ్యంలోని పార్టీ తీసుకున్న రాజ‌కీయ నిర్ణ‌యాలు ఆ పార్టీపై రాజ‌ధాని గుంటూరు జిల్లాలో సంతృప్తి పెరిగేందుకు కార‌ణ‌మ‌ని తేలింది. రాజ‌కీయాల ప‌రంగా చూస్తే...కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ, ఏపీకి అన్యాయం చేస్తున్న విధానాల‌పై మండిప‌డుతూ బీజేపీకి గుడ్ బై చెప్ప‌డాన్ని అనేక‌మంది హ‌ర్షిస్తున్నారు. దీంతోపాటుగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఆ పార్టీని ఓడించేందుకు ఓట్లు వేయాల‌ని పిలుపునివ్వ‌డం కూడా రాజ‌ధాని ప్రాంతాల్లోని వారిలో సంతృప్తిని పెంచేందుకు కార‌ణ‌మైంద‌ని తేలింది. అందుకే ఇటీవ‌లి వ‌ర‌కు 63% ఉన్న సంతృప్తి ఏకంగా ఆరు శాతం పెరిగి 69కి చేరింద‌ని ఆర్టీజీఎస్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఈ స‌ర్వేలో పాల్గొన్న‌వారు బీజేపీ అధికారంలోకి రాకుండా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క పాత్ర పోషించార‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఆర్‌టీజీఎస్ వ్యవస్థ ద్వారా మే 1 వ తేదీ నుంచి మే 26 వరకు సుమారు కోటి మంది వివిధ వర్గాల ప్రజలకు ఫోన్లు చేసి ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 24.41 లక్షల మంది తమ తమ అభిప్రాయాలను తెలియచేయగా వారిలో 17.93 లక్షల మంది ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారని, 6.47 లక్షల మంది అంటే 26.53% మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారని స‌మాచారం. అయితే కేవ‌లం గ‌ణాంకాల‌తోనే వ‌దిలివేయ‌కుండా అసంతృప్తి వ్యక్తం చేసినవారి అభిప్రాయం తెలుసుకొని వదిలేయకుండా వారి అసంతృప్తికి కారణం ఏమిటి? వారి సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు గురించి కూడా ఆర్టీజిఎస్ సిబ్బంది సమగ్రంగా అడిగి తెలుసుకున్నారని త్వ‌ర‌లోనే వీటికి ప‌రిష్కారాలు చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇక స‌ర్వే ఫ‌లితాల గురించి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా జనాల సంతృప్తి సగటు 73.47 శాతంగా ఉంటే...రాజధాని జిల్లాలైన గుంటూరు,కృష్ణా జిల్లాలో మాత్రం 77% గా ఉందని ఆర్టీజిఎస్ సర్వేలో తేలింది. విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లోను సంతృప్తి స్థాయి 74 శాతం కంటే ఎక్కువగా ఉండగా...కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 70 శాతం నుంచి 73 మధ్యలో సంతృప్తి వ్యక్తం చేశారని ఆర్టీజిఎస్ సర్వేలో తేలింది. తాజా ఫ‌లితాల‌తో ఇటు  బ్యూరోక్రాట్ల‌లో అటు టీడీపీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English