ఐటీ ఉద్యోగుల వింత‌ కోరిక...వింటే షాక్!

ఐటీ ఉద్యోగుల వింత‌ కోరిక...వింటే షాక్!

ఆటోమేష‌న్ ప్ర‌భావంతో ఐటీ రంగంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. ఆటోమేష‌న్ ను, స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న వంటి కార‌ణాల‌ను సాకుగా చూపుతూ చాలామంది ఐటీ ఉద్యోగుల‌కు కంపెనీలు ఉద్వాస‌న ప‌లుకుతోన్న విష‌యం విదిత‌మే. కంపెనీకి జీతాల భారం త‌ప్పించేందుకు అధిక జీతం తీసుకుంటూ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న వారిని తొల‌గించి వారి స్థానంలో త‌క్కువ జీతానికి కొత్త వారికి అవ‌కాశాలివ్వ‌డం వంటి ప‌రిణామాలు ఐటీ ఉద్యోగుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

ఒక‌ప్పుడు ఐటీ ఉద్యోగం చేయ‌లాని క‌ల‌లు గ‌న్న యువ‌త ఇపుడు అభ‌ద్ర‌తా భావంతో ఐటీ ఉద్యోగం పేరు చెబితేనే హ‌డ‌లెత్తిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల‌లోని ఐటీ ఉద్యోగులంతా క‌లిసి స‌మావేశ‌మ‌య్యారు. హైద‌రాబాద్ లో శ‌నివారం నాడు జ‌రిగిన స‌మావేశం సంద‌ర్భంగా వారు 27 మంది స‌భ్యుల‌తో ఎగ్జిక్యూటివ్ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి ప‌లు తీర్మానాలు చేశారు.

ఐటీ ఉద్యోగ‌లును కూడా కార్మిక చ‌ట్టం ప‌రిధిలోకి తేవాల‌ని క‌మిటీ తీర్మానించింది. ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌ని, ఐటీ ఉద్యోగుల‌ను ఆదుకోవాల‌ని క‌మిటీ అధ్య‌క్షుడు కిర‌ణ్ చంద్ర కోరారు. త‌మ‌ను కూడా కార్మిక చ‌ట్టం ప‌రిధిలోకి తెచ్చేందుకు కార్మిక శాఖ ముందుకు రావాల‌ని, ఈ ప్ర‌కారం ప్ర‌భుత్వం శ్వేతప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆటోమేష‌న్, ప‌ర్ ఫార్మ‌న్స్ పేరుతో ఐటీ ఉద్యోగులను హ‌ఠాత్తుగా తొల‌గిస్తున్నార‌ని, ఆ కార‌ణంగా చాలామంది ఉపాధి కోల్పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌త ఏడాది వెరిజోన్, టెక్ మ‌హేంద్ర వంటి సంస్థ‌లు చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ల‌లోని త‌మ బ్రాంచ్ ల‌లో ఉద్యోగుల‌ను చెప్పాపెట్ట‌కుండా తొల‌గించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై స‌ద‌రు ఉద్యోగులు మాన‌వ హ‌క్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇదే త‌ర‌హాలో హైద‌రాబాదులోని హైకోర్టులో కూడా ఓ సంస్థ‌పై కేసు విచార‌ణ‌లో ఉంది. ఐటీ ఉద్యోగుల తాజా డిమాండ్ల నేప‌థ్యంలో...ప‌లు ఐటీ సంస్థ‌లు, ప్ర‌భుత్వం స్పంద‌న ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.

మరోవైపు, విదేశాల‌లో ఉండే చాలా ఐటీ దిగ్గ‌జ సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌ను న‌డిపించేందుకు మాత్ర‌మే ఇండియాలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటాయి. విదేశాల‌లో లేదా స్వ‌దేశంలో క్ల‌యింట్ లొకేష‌న్, అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఆయా సంస్థ‌లు అప్ప‌గించిన ప్రాజెక్టుల‌ను సకాలంలో పూర్తి చేసినందుకు గానూ ప్ర‌తి ప్రాజెక్టుకు కొంత‌ డ‌బ్బు చెల్లిస్తాయి. ఆ డెడ్ లైన్ల‌ను అందుకునే క్ర‌మంలో ఐటీ ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

ఒక‌వేళ తాజాగా ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేసిన ప్ర‌కారం ఐటీ ఉద్యోగ‌లను కూడా కార్మిక చ‌ట్టాల ప‌రిధిలోకి తెస్తే భార‌త్ లో ఐటీ కంపెనీలు త‌గ్గిపోయే అవ‌కాశ‌ముంది. లేదంటే వేరే దేశానికి త‌ర‌లిపోయే చాన్స్ ఉంది. ఒక వేళ కార్మిక చ‌ట్టాల ప‌రిధిలోకి ఐటీ ఉద్యోగులు వ‌స్తే....జీతాభ‌త్యాల విష‌యంలో కూడా కొన్ని ఇబ్బందులు రావ‌చ్చు. ఇపుడున్న త‌ర‌హాలో వీకెండ్ సెల‌వులు గ‌ట్రా ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రి, ఈ అంశాల‌ను కూడా ఐటీ ఉద్యోగులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని కంపెనీల‌తో చ‌ర్చించి త‌మ స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించుకోవ‌డం మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు