మ‌రే పార్టీలో క‌నిపించ‌ని ఫుడ్ మెనూ టీడీపీ మ‌హానాడులో

మ‌రే పార్టీలో క‌నిపించ‌ని ఫుడ్ మెనూ టీడీపీ మ‌హానాడులో

చాలానే రాజ‌కీయ పార్టీలున్నా..  టీడీపీ లాంటి చిత్ర‌మైన పార్టీ మ‌రెక్క‌డా క‌నిపించ‌దు. రాజ‌కీయ పార్టీలు త‌మ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని మ‌హానాడు పేరుతో నిర్వ‌హిస్తుంటాయి. ఎక్క‌డి దాకానో ఎందుకు.. ఈ మ‌ధ్య‌నే టీఆర్ఎస్ మ‌హానాడు జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగం.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు.. నేత‌ల ప్ర‌సంగాలు.. హాజ‌రైన వారికి సంబంధించి వార్త‌లు బోలెడ‌న్నిక‌నిపిస్తాయి. కానీ.. మ‌హానాడు సంద‌ర్భంగా వ‌డ్డించిన తిండి లెక్క‌లు పెద్ద‌గా హైలెట్ కావు.


కానీ.. టీడీపీ య‌వ్వారం వేరు. ఆ పార్టీ మ‌హానాడు అంటే.. బాబు ప్ర‌సంగాలు.. మ‌హానాడు ఎజెండా కంటే కూడా మ‌హానాడులో వ‌డ్డించే వంట‌ల గురించి..స్వీట్ల గురించి.. అదే ప‌నిగా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. టీడీపీలో ఫుడ్ మెనూకు ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాద‌ని చెబుతారు.

మూడు రోజుల పాటు సాగ‌నున్న మ‌హానాడులో హైలెట్ ఏమిటంటే.. మ‌రో మాట‌కు తావు లేకుండా ఫుడ్ గా చెప్పేస్తుంటారు.ఉద‌యం సాయంత్రం వండి వార్చే ఆహార‌ప‌దార్థాల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు భారీగా ఉంటుంది. కొంత‌మంది అయితే.. మ‌హానాడులో నేత‌ల ప్ర‌సంగాలు.. తీర్మానాల మీద కంటే ఫుడ్ మెనూ మీద‌నే ఎక్కువ‌గా దృష్టి పెడ‌తార‌ని చెబుతారు. మూడు రోజుల పాటు భారీగా సాగే మ‌హానాడులో వ‌డ్డించాల్సిన మెనూ బాధ్య‌త‌ను అంబికాస్ కేట‌రింగ్ అండ్ ఈవెంట్ ఆర్గ‌నైజేష‌న్ కు అప్ప‌జెప్పారు.

ఇక‌.. భోజ‌నాల‌కు సంబంధించిన బాధ్య‌త‌ల్ని రాష్ట్ర మంత్రితో పాటు.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి అప్ప‌గించారంటే ఏర్పాట్లు ఎంత భారీగా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. మూడు రోజుల పాటు సాగే మ‌హానాడులో మొత్తంగా రెండు ల‌క్ష‌ల మందికి భోజ‌నాల్ని వండి వడ్డించ‌బోతున్నారు. 60 వేల మందికి టిఫిన్లు.. ల‌క్షకు పైగా సాయంత్రం స్నాక్స్ ను అందించ‌నున్నారు. మొత్తం నాలుగు కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

ఇక‌.. మెనూ విష‌యానికి వ‌స్తే పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రిగింద‌నే చెప్పాలి. ఒక రోజుతో మ‌రో రోజు సంబంధం లేకుండా.. ఐటెమ్స్ దాదాపు రిపీట్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టంతో పాటు.. మెనూ చూసినంత‌నే తినాల‌నిపించేలా ఉండ‌టం టీడీపీ స్పెషాలిటీగా చెప్పాలి.

మొద‌టి రోజు మెనూ. (మే 27)

అల్పాహారం
స్వీట్‌ రవ్వకేసరి, గోధుమ రవ్వ స్వీటు ఇడ్లీ, మైసూరు బొండా, టమాటా బాత్‌, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టీ, కాఫీ.

మధ్యాహ్న భోజనం
ఆపిల్‌ హల్వా, పూర్ణం, మద్రాసు పకోడి, కొబ్బరి అన్నం, కడాయ్‌ వెజిటబుల్‌ కూర్మా, రైతా, మామిడి ఆకురాల పప్పు, దొండకాయ్‌ కార్న్‌ కోటెడ్‌ ఫ్రై, ములక్కాడ టమోట కర్రీ, గుత్తి వంకాయ కూర, బీరకాయ – పచ్చి బటాని, పచ్చి టమోట, కొత్తిమీర రోటీ చట్నీ, మామిడి పచ్చడి. డైమండ్‌ చిప్స్‌, సాంబార్‌, మజ్జిగచారు, వైట్‌ రైస్‌, పెరుగు, ఐస్‌క్రీమ్‌.
సాయంత్రం: స్నాక్స్‌గా తాపేశ్వరం కాజ, ఆకు పకోడి.

రాత్రి భోజనం
సేమ్యా కేసరి, మిర్చి బజ్జి, టమాట పప్పు, బంగాళదుంప ఫ్రై, దోసకాయ కూర, గోంగూర చట్నీ, సాంబార్‌, చిప్స్‌, వైట్‌ రైస్‌, పెరుగు.

రెండోరోజు (మే 28)

ఎన్‌టీఆర్‌ పుట్టినరోజు నేప‌థ్యంలో  ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూను సిద్ధం చేస్తున్నారు.

ఉద‌యం అల్పాహారం
స్వీట్‌ సేమ్యారవ్వ కేసరి, ఇడ్లీ, పునుగు, గారి, కట్టిపొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, టీ – కాఫీ

మధ్నాహ్నం భోజనం
చక్కెర పొంగలి, బాదం కత్రి, మసాల వడ, చింతపండు పులిహోర, వెజ్‌ బిర్యానీ, వెజ్‌ జైపూర్‌ కూర్మా, రైతా, ముద్దపప్పు, దప్పళం, బెండకాయ కొబ్బరి ఫ్రై, వంకాయ బటాణీ ఫ్రై, కొత్త మామిడి పచ్చడి, గోంగూర చట్నీ, ఉలవచారు క్రీమ్‌, సాంబారు, ప్లవర్‌ పాపడ్‌, వైట్‌ రైస్‌, హెరిటేజ్‌ పెరుగు, హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌.

సాయంత్రం
స్నాక్స్‌గా పూతరేకులు, కాజు, వేరుసెనగ పకోడి

రాత్రి భోజనం
బెల్లం జిలేబీ, వెజ్‌ కట్లెట్‌, పప్పు ఆకు కూర, వంకాయ పకోడి, సింగిల్‌ బీన్స్‌ గ్రేవీ కర్రీ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ చట్నీ, సాంబార్‌, చిప్స్‌, వైట్‌ రైస్‌, పెరుగు

మూడోరోజు (మే29)
అల్పాహారం
ఇడ్లీ, పునుగు, రవ్వ ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ , టీ,/కాఫీ

మధ్నాహ్న భోజనం
బ్రెడ్‌ హల్వా, గులాబ్‌జామ్‌, కార్న్‌రోల్‌, టమాటో రైస్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కూర్మా, రైతా, టమాటా పప్పు, క్యాబేజీ – క్యారట్‌ – కోకోనట్‌ ఫ్రై, సొరకాయ మసాలా కర్రీ, బెండకాయ పులుసు, మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ రోటి పచ్చడి. మామిడికాయ పచ్చడి, ఫ్లవర్‌ పాపడ్‌, సాంబార్‌, పచ్చి పులుసు, అన్నం, హెరిటేజ్‌ పెరుగు, హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌.

సాయంత్రం
స్నాక్స్‌గా బందరు లడ్డు, మురుకలు

రాత్రి భోజనం
ఫ్రూట్‌ కేసరి, అరటికాయ బజ్జీ , సొరకాయపప్పు, దొండకాయ కొబ్బరి ఫ్రై, మామిడి – దోసకాయ – మిల్‌మేకర్‌ చట్నీ, సొరకాయ చట్నీ, సాంబార్‌, చిప్స్‌, వైట్‌ రైస్‌, పెరుగు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు